మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ముక్కు నేలకు రాయాల్సింది ఎవరో.. పదవులకు రాజీనామా చేయాల్సింది ఎవరో.. సన్నాసులు ఎవరో.. అంటూ వ్యాఖ్యానించారు. అబద్దాలు చెబుతున్నది ఎవరో.. నిజాలు మాట్లాడుతున్నది ఎవరో.. అంటూ మండిపడ్డారు. రైతు రుణమాఫీపై మంత్రి చెప్పింది శుద్ధ అబద్దమని అని కేటీఆర్ తెలిపారు. రేవంత్.. కొండారెడ్డిపల్లిలో లేదా కొడంగల్‌లో ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణలు చెబుతారాన అని కేటీఆర్ సవాల్ విరిసారు. రైతు డిక్లరేషన్ ఓ బూటకం.. సంపూర్ణ రైతు రుణమాఫీ పచ్చి అబద్దం అని అన్నారు. కాంగ్రెస్ పాలన తెలంగాణ రైతాంగానికి ముమ్మాటికీ శాపంగా మారిందని కేటీఆర్ చెప్పారు.