Andhra Pradesh | బెంగళూరు వైపు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సును ఐచర్ వాహనం ఢీ కొన్న ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్ట్ వద్ద జరిగింది. మృతుడు నార్పల మండలంకు చెందిన వెంకటరాముడిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది కేఎస్ ఆర్టీసీ బస్సులో ఉండగా.. పది మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై చిలమత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.