లక్ష డప్పులు, వేయి గొంతుకల సాంస్కృతిక కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోడాన్ని ఖండిస్తున్నామన్నారు MRPS చీఫ్ మంద కృష్ణమాదిగ. సీఎం, డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ పునరాలోచించి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంగా భావించవద్దని కృష్ణమాదిగ అన్నారు. మాదిగల వారసత్వ కులవృత్తి చెప్పులు కుట్టడం ఎప్పుడో దూరం అయిందన్నారు. ఇక మాదిగల సాంస్కృతిక డప్పు వాయిద్యాలు కూడా కాల క్రమేణా దూరం అవుతున్నాయని కృష్ణమాదగ చెప్పారు. డప్పు వాయిద్యాలకు పునర్జీవం పోసేందుకే లక్ష డప్పులు, వేయి గొంతుకల కార్యక్రమం అన్నారు. అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు, డప్పును రక్షించుకోడానికి కృషిచేస్తామని కృష్ణమాదిగ స్పష్టం చేశారు.