తనది కాంగ్రెస్ డీఎన్ఏ అని.. తనపై ఉద్దేశపూర్వకంగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పుడు వార్తలను కార్యకర్తలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యక్రమాలను ఎక్కడా దూరంగా లేనని.. తన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని స్పష్టంచేశారు. పార్టీ మారేందుకు తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవన్నారు. కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి గుడ్ బై చెప్పారని ఉదయం నుంచి వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా టీపీసీసీ చీఫ్, ఏఐసీసీ పదవులు రాకపోవడంతో ఆయన పార్టీ మారనున్నారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది.
Read Also: నేను ఏమైనా డాన్ అనుకుంటున్నారా?.. హౌస్ అరెస్టుపై కోటంరెడ్డి ఆగ్రహం
Follow us on: Youtube, Instagram, Google News