Corona Updates |దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా దేశవ్యాప్తంగా 5,335 కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్ తర్వాత దేశంలో రోజువారీ కేసుల సంఖ్య 5వేలు దాటడం ఇదే తొలిసారి కావడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివిటీ రేటు కూడా 3.32శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 25,587 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,826 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 4కోట్ల 41లక్షలు 82వేల 538గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 5లక్షల 30వేల 929గా నమోదైంది. ఇక రికవరీ రేటు 98.75శాతం ఉండగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 0.06శాతంగా ఉంది.
Read Also: నేనెందుకు రాజీనామా చేస్తా.. నాది కాంగ్రెస్ డీఎన్ఏ: కోమటిరెడ్డి
Follow us on: Youtube, Instagram, Google News