రాష్ట్రంలో పెట్రేగిపోతున్న గుండాగిరీ, అవినీతిని అంతం చేయడానికి పొత్తు పెట్టుకున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న ల్యాండ్ మాఫీయాలను అంతం చేస్తామని హామీ ఇచ్చారు. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సమావేశంలో అమిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా చేయడానికి పొత్తు పెట్టుకున్నా మన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అవినీతి కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాబోయే రెండేళ్లలో పోలవరం పూర్తి చేసి చూసిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.


