2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిర్ణయించిన ముహుర్తం ప్రకారం 10.08 గంటలకు బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టారు. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది కూటమి సర్కార్.
బడ్జెట్ లెక్కలు..
2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.322359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారుఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. తొలిసారి రూ. 3 లక్షలు కోట్లు దాటిన రాష్ట్ర బడ్జెట్. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటిన ఏపీ బడ్జెట్. రెవెన్యూ వ్యయం రూ. 251162 కోట్లు. కాగా.. రెవెన్యూ లోటు రూ. 33185 కోట్లు. ద్రవ్య లోటు రూ. 79926 కోట్లు మూల ధన వ్యయం రూ.40635 కోట్లుగా ఉంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తున్నామని పయ్యావుల కేశవ్ చెప్పారు. నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటను ఎంచుకున్నారన్నారు. తమను తాము కాపాడుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని మరువలేమని చెప్పారు.
ఇంకా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. “రాజధాని పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజన్‌లా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. రాజధాని అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని నిరూపితమైంది. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్టు నుంచి రూపాయి కూడా కేటాయించడం లేదు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంక్, హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతికి నిధులు సమకూరాయి.
ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తెచ్చినప్పటి పరిస్థితులను బడ్జెట్ ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు పయ్యావుల. డ్రిప్ ఇరిగేషన్‌పై అధ్యయనానికి ఇజ్రాయెల్ వెళ్లిన బృందంలో తానూ సభ్యుడిగా ఉన్నట్టు చంద్రబాబుకు గుర్తు చేసిన ఆర్థిక మంత్రి.
“దేశంలో తొలిసారిగా ఉమ్మడి ఏపీలోనే డ్రిప్ ఇరిగేషన్ పైలెట్ ప్రాజక్టును అమలు చేశాం. జాతీయ స్థాయిలో డ్రిప్ ఇరిగేషనుపై వేసిన టాస్క్ ఫోర్సుకు చంద్రబాబే ఛైర్మనుగా ఉన్నారు. చంద్రబాబు ఇవాళ ఏం ఆలోచిస్తారో.. రేపు దేశం అదే ఆలోచిస్తుందనడానికి డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టే నిదర్శనం. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ లేని రాష్ట్రం లేదు.. డ్రిప్ ఇరిగేషన్ లేని పొలం లేదు. ఇలాంటి కీలకమైన డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.”.. అని పయ్యావుల అన్నారు,.