ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆయన చెప్పారు. అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజ్ నిర్మిస్తామని చెప్పారు. జూనియర్ న్యాయవాదులకు 10వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని తెలిపారు. అలాగే.. నిందితులకు శిక్ష పడేలా విచారణ ఉండాలని అన్నారు. వచ్చే కేబినెట్‌లో తీర్మానంచేసి కేంద్రానికి పంపిస్తామని.. బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనలు కూడా కేంద్రానికి పంపిస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు.