ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Kethireddy Venkatarami Reddy) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ సందర్భంగా కేతిరెడ్డి మహిళలను ఉద్దేశించి ‘ఇప్పుడే కదా టిఫిన్లు తిన్నారు.. అప్పుడే అన్నానికి పోతున్నారు. కాసేపు కూడా ఆగలేరా.. అందేకే మన బతులకు ఇట్లున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ‘పొద్దున నుంచి సాయంత్రం దాకా నేను, నా భార్య, తమ్ముడు రోడ్ల మీద తిరుగుతున్నాం.. కుటుంబం మొత్తం మీకు చాకిరి చేయడం తప్ప మాకు వేరే పని లేకుండా పోతుంది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంత చేసినా కూడా మా మీద పడి ఏడుస్తున్నారంటూ అసహనం వ్యక్తంచేశారు. అలాగే తనపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేతలను కూడా డెకాయిట్ నాకొడకల్లారా అంటూ సంబోధించారు. కేతిరెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో ప్రతిపక్షాలు అధికార పార్టీ వైసీపీ నేతలకు మహిళల పట్ల ఉండే గౌరవం ఇదేనంటూ విమర్శలు చేస్తున్నారు.
ప్రజల చేత ఓట్లేయించుకుని అధికారం అనుభవిస్తా… ఆ అధికారం అడ్డం పెట్టుకుని కబ్జాలు, మైనింగ్ లు చేసుకుంటూ వందల కోట్లు సంపాదిస్తా… చివరికి ప్రజల గురించి ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారో చూడండి. అయ్యా! కేతిరెడ్డిగారూ.. మిమ్మల్ని ఎన్నుకున్నదే ప్రజలకు సేవ చేయడానికి. అది గుర్తుంచుకోండి. pic.twitter.com/3d71RJNrZT
— Telugu Desam Party (@JaiTDP) April 15, 2023