Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

కేజ్రీవాల్ అరెస్ట్ బీజేపీకి ఎదురుదెబ్బ ?

      లోక్ సభ ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ బీజేపీ విజయావకాశా లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. ఇది కాషాయం పార్టీకి ప్లస్సా.. మైనెస్సా.. ఆప్ ఏకైక స్టార్ కాంపేనర్ అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా రాదా.. రాకుంటే.. ఎన్నికల్లో ఆప్ ప్రచారంపైన, విజయావకాశా లపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ప్రస్తుతం సగటు ఓటర్లలో ఇదే ప్రశ్న?

  దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల జోరు మొదలైంది. తొలి దశ ఎన్నికలకు రంగం సిధ్ధమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఆమ్ ఆద్మీపార్టీ లోక్ సభ ఎన్నికల సన్నాహా లు, ప్రచారానికి పెద్ద విఘాతమే. కేజ్రీవాలే కాదు.. పార్టీ కీలకనేతలు జైలులో ఉన్నారు. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవా మరి కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులను రంగంలోకి దించాలని ఆ పార్టీ ఆలోచిస్తోంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమితో సమన్వయం చేసుకోవల్సిన తరుణం ఇది. పంజాబ్ వ్యవహారాలపై సీఎం భగవంత్ సింగ్ మాన్ దృష్టి పెట్టినా ఢిల్లీలో పాలన ఈ అరెస్ట్ వల్ల స్థంభిం చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఎటు చూసినా.. ఆప్ పార్టీకి కష్టమే.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్, సీనియర్లు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ కూడా అరెస్ట్ కావడంతో పార్టీకి పెద్దదిక్కు కరవైంది. కేజ్రీవాల్ బెయిల్ పై ఏప్రిల్ 1న కోర్టులో విచా రణ ఉంది.. కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా..రాదా అన్నది పెద్ద ప్రశ్నే. బెయిల్ వస్తే..కష్టాలు గట్టెక్కి నట్లే. లేని పక్షంలో ద్వితీయశ్రేణి నాయకత్వం పైనే ప్రచార భారం పడుతుంది. కేజ్రీవాల్ సతీమణి సునిత కేజ్రీ వాల్, మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పైనే ఆధారప డాల్సి ఉంటుంది. వారి అనుభవలేమి కూడా పార్టీకి ఇబ్బందే. ఢిల్లీలో నాలుగు పార్లమెంటు సీట్లతోపాటు, గుజ రాత్ లోనూ రెండుసీట్లలో ఆప్ పార్టీ అభ్యర్థులను నిలుపుతోంది. ఢిల్లీలో “సన్సద్ మే భీ కేజ్రీవాల్” అంటూ గుజరాత్ లో “గుజరాత్ మే భీ కేజ్రీవాల్ “అని ప్రచారానికి ఆప్ ప్రారంభించింది. పంజాబ్ లో మొత్తం 13 స్థానాల్లోనూ ఆమ్ ఆద్మీపార్టీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ కు కానీ, కూటమి మిగతా పార్టీలకు కానీ ఒక్కసీటు కేటాయించలేదు. ఆమ్ ఆద్మీపార్టీ బ్రాండ్ అంబాసిడర్ అరవింద్ కేజ్రీవాల్.. ఆయన చిత్రం తోనే ఓట్లుఅడుగుతామని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పడం విశేషం.

పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ మొదలైన వేళ.. కేజ్రీవాల్ అరెస్ట్ బీజేపీ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపు తుందన్నది కీలక ప్రశ్న. దేశవ్యాప్తంగా మోదీ హవా నడుస్తోంది కాబట్టి ఎలాంటి వష్టం ఉండదనే మేకపొతు గాంభీర్యంతో బీజేపీ ఉంది. అయినా, అంతర్గతంగా అనుమానాలు లేకపోలేవు. ఎలక్టోరల్ బాండ్ల అంశం.. బీజేపీ ఇతర పార్టీలన్నింటి కన్నా…. ఎక్కువ నిధులు దండుకుందన్న ప్రచారం హోరెత్తుతుండడంతో ప్రజల దృష్టి మరల్చేం దుకే కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ పార్టీ నిధుల స్తంభన వంటి చర్యలకు దిగిందన్న ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికల ఫలితాలు వస్తే తప్ప.. బీజేపీకి ఎదురు దెబ్బ తగిలిందా అన్నది తెలియదు. ప్రత్యర్థి పార్టీలను అణచివే యడమే లక్ష్యంగా కొద్దికాలంగా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దానిలో భాగమే.. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్,, ఇప్పుడు కేజీవాల్ అరెస్ట్. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే డైలమాలో కాషాయదళం ఉంది. జార్ఖండ్ లో బీజేపీ ఇద్దరు కీలక మహిళా నాయకురాళ్లను ఆకట్టుకోవ డంలో సక్సెస్ సాధించింది. జార్ఖండ్ ఏకైక కాంగ్రెస్ ఎంపీ గీత ఖోడా ఫిబ్రవరి 26న బీజేపీలో చేరారు. గీత ఖోడా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భార్యే. మార్చి 19న జార్ఖండ్ ముక్తిమోర్చా ఎమ్మెల్యే సీతా సోరెన్ కు కాషాయ కండువా కప్పి పార్టీలో చేర్చుకుంది. సీత సోరెన్.. హేమంత్ సోరెన్ పెద్దన్న, దివంగత దుర్గా సోరెన్ భార్య. ఈ చర్యల వల్ల రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఏమేరకు గిరిజనులు, ఆదివాసీల ఓటర్లను ఆకట్టు కోగలుగుతుందో.. ఆలోచించడం తొందరపాటే కాగలదు. జార్ఖండ్ లో 27 శాతం షెడ్యూల్డ్ తెగలు, 14.53 శాతం ముస్లీం ఓట్లు, యాదవులు, ఇతర వెనుకబడిన తరగతులు, దళితులు హేమంత్ సోరెన్ కు రానున్న ఎన్నికల్లో అండగా నిలిచే అవకాశం ఉంది.

    ఢిల్లీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్ తో కేజ్రీవాల్ సతీమణి ప్రజల ముందుకు వచ్చి ఎమోషనల్ కావడంతో ఆప్ పై సానుభూతి పెరిగింది. ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమికి చెందిన దాదాపు 18 పార్టీల అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండిస్తూ.. మహాధర్నా నిర్వహిం చాయి. ప్రతి పక్షాల మద్దతుతో ఢిల్లీలో సానుభుతి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రాజ కీయ పరిస్థితి ఎదుర్కొనేందుకు మోదీ సర్కార్ ఏ వ్యూహాలు అమలు చేస్తుందో చూడాలి.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్