29.2 C
Hyderabad
Sunday, May 10, 2026
spot_img

కాంగ్రెస్‌ పార్టీ గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నాడు- బండి సంజయ్

స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీలో 30 మంది ఎమ్మెల్యేలను స్వయంగా  డబ్బులు పెట్టి గెలిపించుకోవాలని కేసీఆర్ చూస్తున్నాడని, వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళని మళ్లీ టిఆర్ఎస్ లోకి తీసుకుంటాడని బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఆరోపించారు. ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడున్న ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తూ జాబితా ప్రకటించారని.. అయితే ఎన్నికల సమయానికి అందులో సగం మందికి టికెట్లు ఇవ్వకుండా ఎగ్గొడతాడని ఆరోపించారు.
ఎన్నికలు రాగానే కేసీఆర్ అమలు కానీ హామీలు ఇస్తున్నారని విమర్శించారు. చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో.. బీఆర్ఎస్ గెలిపిస్తే ఒక్కో కుటుంబానికి చంద్రమండలంలో మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సెటైర్లు వేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే కోటీశ్వరులు అయ్యారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం చంద్రమండలంపై ఎలాంటి దందా చేయవచ్చు అని ఆలోచన చేస్తోందని ఎద్దేవా చేశారు.  గవర్నర్‌కు భయపడే సీఎం కేసీఆర్ సయోధ్యకి వచ్చారన్నారు. బిల్లుల ఆమోదం కోసమే గవర్నర్‌తో సీఎం సయోధ్యకు వచ్చారని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, సీఎం కేసీఆర్‌లు అన్నదమ్ములని అని సెటైర్లు వేశారు.

Latest Articles

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… మోదీతో రేవంత్ ప్రత్యేక భేటీ

హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక పరిణామాలకు రంగం సిద్ధమైంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi) హైదరాబాద్‌కు రానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక వినతులు సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్