ముంబైలోని తన ఇంట్లో సైఫ్ అలీఖాన్ పై అటాక్ జరగడంతో ప్రస్తుతం ఆయన లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయనకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఆరు చోట్ల గాయాలు కాగా.. రెండు చోట్ల లోతుగా గాయాలయ్యాయి. వైద్యులు ఆయనకు సర్జరీ చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్, వారి పిల్లలు క్షేమంగా ఉన్నారు.
ఇదిలా ఉంటే సైఫ్‌పై దాడికి ముందు, ఆయన భార్య కరీనాకపూర్.. డిన్నర్ పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. తన సోదరి కరిష్మా కపూర్ , ఆమె సన్నిహితులు సోనమ్, రియా కపూర్‌లతో కలిసి డిన్నర్ డేట్ చేసింది. నటి తన డిన్నర్ డేట్‌కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి “గర్ల్స్ నైట్ ఇన్” అని క్యాప్షన్ ఇచ్చింది.
సైఫ్ అలీఖాన్‌పై నటుడి టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోరీకి యత్నం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం నటుడికి ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరుగుతోందన్నారు. ఈ విషయంపై అభిమానులు, మీడియా సంయమనం పాటించాలని కోరారు. ఇది పోలీసు కేసుకు సంబంధించిన వ్యవహారం కాబట్టి పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తామని వెల్లడించారు.