Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

వ్యూహాత్యకంగా ప్రచారానికి సిద్ధమైన కమలనాథులు

    ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎండగట్టాలని కమలనాథులు డిసైడ్ అయ్యారు. గత బీఆర్ఎస్ పాలనలో అవినీతి, కుంభకోణాలను, ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనా లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రజాక్షేత్రం లోకి వెళ్లడానికి సమాయత్తం అయ్యారు.

     పదేళ్ల కాలంలో కారు సర్కారు ఎన్నో అవినీతి, అక్రమాలు సాగించిందని రాష్ట్ర బీజేపీ నేతలు దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాల చిట్టాను ప్రజల ముందు ఉంచుతామని కమలనాథులు తెలియజేశారు. ఇక వంద రోజుల కాంగ్రెస్ పాలనలో సైతం ఎన్నో మోసాలు జరిగాయని, వీటన్నింటిని ప్రజాక్షేత్రంలో పెడతామని, ఇందుకు తమ పార్టీ ప్రత్యేక కార్యాచరణ రూపొం దించిందని బీజేపీ నేతలు తెలిపారు.

     లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అయోధ్య రామమందిరం, మోడీ చరిష్మాను, గత బీఆర్ఎస్ సర్కారు, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు తప్పిదాలను ప్రజలకు తెలియజేస్తామని బీజేపీ నేతలు తెలిపారు. పుస్తక రూపంలో, పత్రాల ద్వారా, సోషల్ మీడియా వేదిక చేసుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తప్పిదాలను ప్రజలకు తెలియజేయడానికి బిజెపి నాయకత్వం రెడీ అయ్యింది. ఇందుకోసం కావల్సిన సమాచారాన్ని ఇప్పటికే పార్టీ  శ్రేణులు సేకరించాయి. బీఆర్ఎస్ కు సంబంధిం చిన అంశాలను అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తమ పార్టీ బీజేపీ సక్సెస్ అయ్యిందని, అయితే, తమకు అనుకూలంగా మలుచుకోవడంలో విజయం సాధించలేకపోయామని బీజేపీ నేతలు తెలిపారు. ఇది కాంగ్రెస్ కు ప్లస్ అయ్యిందన్నారు. అందుకే ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.

     బీఆర్ఎస్ కు సంబంధించి, లిక్కర్ స్కాం, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అంశాలు బీజేపీకి అస్త్రంగా మారనున్నాయి. గత ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన ఎందరో నేతల ఫోన్లు ట్యాప్ చేశారని ఎన్నికల కమిషన్ కు, పోలీస్ అధికారులకు బీజేపీ నేతలు ఫిర్యాదులు చేశారు. దీనిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై సైతం ఇదే స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఒక్క కేసు ఆధారంగా అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అలాకాని పక్షంలో.. బీఆర్ఎస్ ను కాంగ్రెస్ కాపాడే ప్రయత్నం చేస్తోందిని ప్రజల్లోకి తీసుకెళ్లా లని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బీఆర్ఎస్ చేసిన అవినీతి, ఇతర పథకాల్లో కమీషన్ల నుంచి మొదలు, మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోవడం వంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా చేసుకోవడానికి బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు.

    ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పలు పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అనంతరం 100 రోజుల గడువు పెట్టింది. అయితే, ఒకటి రెండు పథకాలను మాత్రమే అమలు చేసింది. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, 500 రూపా యలకు గ్యాస్ తప్పించి, మిగిలిన హామీలేవీ నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ పై బీజేపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. రైతులకు రుణమాఫీ, కౌలుదారులకు ఆర్థిక సహాయం, రైతుభరోసా, యువతులకు స్కూటీలు, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, ఉద్యోగాల భర్తీ ఇలా ఎన్నో హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని ప్రజాక్షేత్రంలో చాటి చెప్పాలని కాషాయ దళాలు డిసైడయ్యాయి. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. ప్రత్యేకించి మహిళా ఓటర్లపై దృష్టి సారించి, ఆ ఓట్లు రాబట్టేలా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. తమకు దొరికిన ప్రతి అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలని కమలనాథులు భావిస్తున్నట్టు తెలిసింది.

బీఆర్ఎస్ అవినీతిని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు పర్చకపోవడాన్ని ప్రజాక్షేత్రంలో తెలియజే యడానికి యావత్ బీజేపీ నేతలు సమాయత్తం అవుతున్నారు. గల్లీ నాయకులు నుంచి ఢిల్లీ జాతీయ స్థాయి బీజేపీ నేతల వరకు అందరూ… సభలు సమావేశాలు నిర్వహించి ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారు. అయితే, కాషాయ పార్టీ ఎంచుకున్న బీఆర్ఎస్ పదేళ్ల ఫెయిల్యూర్, కాంగ్రెస్ వంద రోజుల వైఫల్యంపై పోరు లోక్ సభ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఎంతవరకు అనుకూలిస్తాయో వేచి చూడాలి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్