వరంగల్ ఎంజీఎం డాక్టర్లకు కనీస సౌకర్యాలు కల్పించి, ఉపకార వేతనాలు చెల్లించాలని జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నా ఎలాంటి స్పందన కనిపించడం లేదన్నారు. సమ్మె తప్ప మరో మార్గం లేకుండా పోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించిన తర్వాతే సమ్మె విరమణ ఉంటుందని స్పష్టం చేశారు. స్టైఫండ్ సకాలంలో విడుదల కోసం గ్రీన్ చానెల్, కేఎంసీ రోడ్ల నిర్మాణం, డాక్టర్ల కోసం కొత్త హాస్టల్ భవనాలు, రెసిడెంట్స్ కోసం సవరించిన గౌరవం వేతనం, వివిధ ప్రభుత్వ ఆస్ప త్రులలో భద్రతా సమస్యలు, నీట్‌లో 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు.