నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు. మధ్యాహ్నం విజయ వాడలోని క్యాంప్ ఆఫీస్‌లో పవన్‌తో నిర్మాతలు భేటీకానున్నారు. ఇందుకోసం నిర్మాతలు అశ్వినీ దత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీన్, దగ్గుబాటి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యార్లగడ్డ హైదరా బాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. కాసేపటి క్రితం గన్నవరం చేరుకున్నారు. థియేటర్ల సమస్య లపై పవన్‌కల్యాణ్‌తో నిర్మాతలు చర్చించనున్నారు. సినిమా టికెట్ రేట్ల విషయంలో వెసులుబాటుపై చర్చించే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని నిర్మాతలు కోరను న్నారు.