ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీ షియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియ డంతో ఆమెను కోర్టు ఎదుట హాజరు పర్చారు. కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోర్టును కోరాయి. దీంతో జూలై 3 వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. లిక్కర్ కేసులో కవితతోపాటు చరణ్‌ప్రీత్ కేసును జులై 3కు వాయిదా వేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లకు లక్ష పూచికత్తు పై బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగియగా, న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మే నెలాఖరులోనే తీర్పు వస్తుందని ఆశించినప్పటికీ రాలేదు. జూన్ నెలాఖరు వరకు హైకోర్టుకు సెలవులు కావడంతో ఆమె ఈ నెలంతా జైల్లోనే ఉండనున్నారు.


