25.9 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

శ్రద్ధ శ్రీనాథ్, కిషోర్ కాంబినేషన్‌లో ‘కలియుగం’

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో త్వరలో ‘కలియుగం’ అనే సినిమా రిలీజ్ కాబోతోంది. ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్, ‘కాంతార’ ఫేమ్ కిషోర్ ఈ సినిమాలో పోటాపోటీగా నటించారు. ఈ సినిమా ఇప్పటివరకూ భారతీయ సినీ ఇండస్ట్రీలో తెరకెక్కని అద్భుతమైన కథతో హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతోంది.

2064 సంవత్సరంలో ఈ మానవాళికి ఏమవుతుంది? ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? అనే విషయాలను ఆధారంగా చేసుకుని ఇండియాలోనే మొట్టమొదటిసారిగా పోస్ట్ అపోకలిప్స్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. భారీస్థాయిలో నిర్మాణమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో బిజీగా ఉంది. అద్భుతమైన గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయి మేకింగ్ ఈ సినిమాని మరో లెవల్‌కు తీసుకు వెళుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్ కె ఇంటెర్నేషనల్ బ్యానర్‌లో కేస్ రామకృష్ణ నిర్మించారు. అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఎన్నో యాడ్స్‌కి డైరెక్టర్‌గా పనిచేసిన ప్రమోద్ సుందర్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇండియన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ దగ్గర చాలా సంవత్సరాలు అసిస్టెంట్‌గా పనిచేసిన రామ్ చరణ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. నాలుగుసార్లు కేరళ ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్న డాన్ విన్సెంట్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం చేస్తున్నారు. హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కుతున్న ఈ కలియుగం సినిమా సినీ ప్రేక్షకులను రంజింప చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే దాదాపుగా అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దక్షిణ భారత భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

నటీనటులు :
కిషోర్ కుమార్ జి., శ్రద్ధా శ్రీనాథ్, ఆర్య లక్ష్మి, ఇనియన్ సుబ్రహ్మణ్యం, సంతోష్
నిర్మాత: కె ఎస్ రామకృష్ణ
నిర్మాణ సంస్థ : ఆర్కే ఇంటర్నేషనల్
డైరెక్టర్: ప్రమోద్ సుందర్
సినిమాటోగ్రాఫర్: కే రామ్ చరణ్
సంగీత దర్శకుడు: డాన్ విన్సెంట్
కళా దర్శకత్వం: శక్తి వెంకట్‌రాజ్ ఎమ్
స్టంట్స్. జిఎన్ మురుగన్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్