ఇన్నాళ్లు నగరాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు రాజధాని సమీప ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది. వ్యవసాయ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మకాలు జరుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్ పేట గ్రామ పరిధిలో రియల్ మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. విజయ్స్ JB టెర్రా ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయిస్తున్నది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ లే అవుట్ పర్మీషన్ నెంబర్లు లేకుండానే ప్లాట్లు విక్రయిస్తున్నారు.
జనాన్ని ఆకట్టుకునేందుకు పూర్తిస్థాయిలో డెవలప్మెంట్ వర్క్ పూర్తికాకుండానే ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరిట మోసం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ నోటీసులకు సైతం స్పందించని రియల్ ఎస్టేట్ సంస్థ స్పందించకపోవడం గమనార్హం. అసైన్డ్ ల్యాండ్, గుట్టలను వదలని రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్లుగా మార్చేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.