17.2 C
Hyderabad
Friday, November 22, 2024
spot_img

Chandrayaan 3 : జయహో ఇస్రో.. చంద్రయాన్ 3 లో కీలక అడుగు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. 18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 మంగళవారం చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ఈ వ్యోమనౌకను ట్రాన్స్‌ లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ‘‘చంద్రయాన్-3 విజయవంతంగా భూ కక్ష్యలను పూర్తి చేసుకుని చంద్రుడివైపు వెళుతోంది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్కింగ్‌లో పేరిజీ-ఫైరింగ్ దశ పూర్తయింది.

 

దీన్ని విజయవంతంగా ట్రాన్స్ లూనార్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టాము, తదుపరి లక్ష్యం చంద్రుడి కక్ష్యలోకి వెళ్లడమే’’ అని ఇస్రో పేర్కొంది. ఇస్రో ప్రణాళిక ప్రకారం ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనున్న చంద్రయాన్ -3, ఆగస్టు 23న జాబిల్లిపై దిగనుంది. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్-3 జులై 14న శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయాణం ప్రారంభించింది.

Latest Articles

రేవంత్‌రెడ్డి ఓ భూ కబ్జాదారు – హరీష్‌రావు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు మాజీ మంత్రి హరీష్‌రావు. రేవంత్‌ ఓ భూ కబ్జాదారుడని ఆరోపించారు. సంగారెడ్డిలో పర్యటించిన హరీష్‌రావు... ప్రశ్నించే గొంతులపై బ్లాక్‌మెయిల్‌ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తనపైనా అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్