స్వతంత్ర వెబ్ డెస్క్: అవనిగడ్డలో నేటి నుంచి ప్రారంభం కానున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘వారాహి’ యాత్రకు జగన్ సర్కారు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. యాత్ర విజయవంతం చేసేందుకు జనసేనతో కలిసి పార్టీ శ్రేణులు నడవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు.
‘‘రేపటి నుంచి ప్రారంభమయ్యే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారి నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకు సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయి. వారాహి యాత్ర విజయవంతం చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు జనసేనతో కలిసి నడవాలని కోరుతున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.