సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గం ఎంపీటీసీ, జడ్పీటీసీలతో సమావేశమైన ఆయన.. చంద్రబాబునాయుడనే దుర్మార్గుడితో యుద్ధం చేస్తున్నామన్నామని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో మెజార్టీ లేకుండా టీడీపీ పోటీచేస్తుందంటే ఏంటి దాని అర్థం అని నిలదీశారు. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నారని.. తన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.