ప్రాచీన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని చిన్న జీయర్ స్వామి అన్నారు. భారతదేశ చరిత్రకు కొలమానం లేదన్న ఆయన పూర్వీకులు తరతరాలుగా అందిస్తున్న ప్రాచీన ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరులో ప్రాచీన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చిన్న జీయర్ స్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మోటుపల్లి రంగాచార్యుల విగ్రహ ప్రతిష్ఠలో ఆయన పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన చిన్నజీయర్ స్వామివారికి ఆలయ నిర్వహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.