24.4 C
Hyderabad
Monday, June 16, 2025
spot_img

ఇరాన్‌పై ప్రతీకార దాడి చేస్తామని ప్రకటించిన ఇజ్రాయెల్‌

   పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తమ దేశంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇరాన్‌పై ప్రతిదాడి తప్పదని.. ఇందుకోసం ఆపరేషన్‌ ఐరన్‌ షీల్డ్‌ చేపడతామని ఇజ్రాయెల్‌ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ హెర్జి హలేవి స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ శనివారం రాత్రి 300కుపైగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని అమెరికా నిఘా వర్గాలు కూడా అంటున్నాయి. ఇప్పుడు స్పందించకుండా మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇరాన్‌ నుంచి మరింత ముప్పు ఏర్పడే అవకాశం ఉందంటూ ప్రజాప్రతినిధులు అంటున్నారు. ప్రతిదాడి విషయంలో తాము ఇజ్రాయెల్‌ను నిర్దేశించలే మని.. నచ్చిన నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ ఆ దేశానికి ఉందని అమెరికా తెలిపింది.అగ్రరాజ్యం అండగా నిలిచినా నిలవకపోయినా.. ఇరాన్‌పై ప్రతిదాడి విషయంలో ముందుకే వెళ్లాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెత న్యాహు సహా మంత్రిమండలిలో ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇరాన్‌ విషయం తేలేవరకు గాజాలోని రఫాపై ఆపరేషన్‌ను నిలిపివేయాలని నెతన్యాహు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడిపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. సంయమనం పాటించాలని ఇరుపక్షాలకు ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ విజ్ఞప్తి చేశారు.

ఇజ్రాయెల్‌పై దాడి సమాచారాన్ని అమెరికాకు 72 గంటలకు ముందే తెలిపామని ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి హసేన్‌ అమీర్‌ అబ్దుల్ల్లా హియాన్‌ అన్నారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం అంద లేదని అమెరికా పేర్కొంది. ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, దాడి ప్రారంభమైన తర్వాతే సమాచారమి చ్చారని తెలిపింది. ఇరాక్‌, తుర్కీయే, జోర్డాన్‌ అధికారులు మాత్రం తమకు ముందస్తు సమాచారం ఇరాన్‌ నుంచి అందిందని తెలిపారు.ఇరాన్‌ దాడి సమయంలో తాము ఇజ్రాయెల్‌కు సాయం చేశామని సౌదీ అరేబియా తెలిపింది. ఇప్పటికే ఈ విషయాన్ని జోర్డాన్‌ బహిరంగంగానే అంగీకరించింది. శనివారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ 300కి పైగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడగా.. వీటిలో కొన్ని ఇరాక్‌ గగనతలంపై నుంచి వెళితే.. మరికొన్ని జోర్డాన్‌, సౌదీ గగనతలాల మీదుగా దూసుకెళ్లాయి. తమ గగనతలంపైకి వచ్చిన వాటిని తాము నేలకూల్చామని సౌదీ అరేబియా తెలిపింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్