21.7 C
Hyderabad
Thursday, March 20, 2025
spot_img

తెరచాటు రాజకీయం చేస్తున్న దేవినేని ఉమ?

తెలుగుదేశంలో కీలక నాయకుడిగా ఉన్న దేవినేని ఉమ కారణంగా పార్టీలో లుకలుకలు మొదలయ్యాయా? తెరచాటు రాజకీయం చేస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. తెలుగుదేశం పార్టీ తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పని చేసిన దేవినేని ఉమకు ఇప్పుడు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. 2014 నుంచి 2019 మధ్య మంత్రిగా పని చేసిన కాలంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పారు. పార్టీలో కూడా తనదైన శైలిలో రాజకీయం చేశారు. చంద్రబాబు కూడా ఉమకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో అంతా తానై నడిపించారు. ఒక విధంగా చెప్పాలంటే.. కృష్ణా జిల్లాలో అప్పట్లో సీఎం చంద్రబాబు కంటే.. ఉమ మాటే ఎక్కువగా చెల్లుబాటు అయ్యేదట.

చంద్రబాబు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని పార్టీలో ఎంతో మందికి ఇబ్బందులు కలిగించారని ఉమపై ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కేసినేని నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారిని ఇబ్బంది పెట్టారని పార్టీలో టాక్ ఉంది. పైగా మైలవరంలో కూడా ఉమ తీరుతో స్థానిక కేడర్ ఇబ్బందులు పడ్డారట. ఈ నేపథ్యంలో 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ఇక వసంత ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత ఉమ నిత్యం విమర్శలు మొదలు పెట్టారు. ఐదేళ్ల పాటు వసంతపై ఉమ చేయని ఆరోపణ లేదు. మరోవైపు వసంతకు వైసీపీలో కూడా తగిన గుర్తింపు లభించకపోవడంతో ఆయన టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఇది ఉమకు ఇబ్బందిగా మారింది.

2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమతో కలసి మాట్లాడాలని ప్రయత్నించినా వసంతను ఆయన దగ్గరకు రానివ్వలేదు. పైగా వసంతకు వ్యతిరేకంగా పని చేశారనే టాక్ ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు.. ఉమను ఎన్నికలు అయ్యే వరకు సైలెంట్‌గా ఉండాలని హెచ్చరించారట. దీంతో అప్పట్లో ఉమ సైలెంట్ అయ్యారు. కూటమి ప్రభంజనంలో వసంత రెండో సారి ఎమ్మెల్యేగా గెలవడంతో ఉమ ప్రాబల్యం తగ్గిపోతూ వచ్చింది. ఇది ఉమ, ఆయన అనుచరులకు మైలవరం నియోజకవర్గంలో ఇబ్బందిగా మారిందట. అందుకే ఈ మధ్య తెరచాటు రాజకీయాలు మొదలు పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న ఉమ.. నెమ్మదిగా యాక్టీవ్ అవడానికి ప్రయత్నిస్తున్నారట.

కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు స్వయంగా కొన్ని చోట్లకు వెళ్లి ఫించన్ల పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వెళ్లని ప్రాంతాలకు ఉమ వెళ్తుండటంతో కేడర్ ఇబ్బంది పడుతున్నారట. ఎమ్మెల్యేతో వెళ్లాలా? ఉమ వెంట నడవాలా? అని కార్యకర్తలు కూడా అయోమయానికి గురవుతున్నారట. ఎమ్మెల్యేలకు సమాంతరంగా ఉమ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం మైలవరంలో తెలుగు తమ్ముళ్లకు ఇబ్బందిగా మారిందట. పైగా ఉమ సొంత ప్రభుత్వం అని చూడకుండా కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. మైలవరంలో రేషన్ మాఫియా కోట్లాది రూపాయలు కొల్లగొడుతోందని.. దీనిపై సమగ్ర విచారణ చేస్తామంటూ ఉమ ట్వీట్ చేయడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.

మైలవరంలో వసంత కృష్ణను ఇబ్బంది పెట్టేందుకే.. ఉమ ఇలాంటి పోస్టులు పెడుతున్నారని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు. అనవసరంగా రేషన్ మాఫియా అవినీతిన వసంత కృష్ణకు అంటించేందుకు ఉమ ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు తన పాత నియోజకవర్గం నందిగామలో కూడా ఉమ కలుగజేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్‌ పదవికి ఎన్నికలు జరిగాయి. ఎంపీ కేశినేని చిన్ని ఒక పేరు ప్రతిపాదించగా.. స్థానిక ఎమ్మెల్యే మరో వ్యక్తికి ఇవ్వాలని పట్టుబట్టారు. దీంలో అధిష్టానం వారిద్దరూ సూచించినవారికి కాకుండా వేరే వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టింది. అయితే ఈ తతంగంలో తెరవెనుక రాజకీయం చేసింది ఉమనే అని అధిష్టానానికి ఫిర్యాదు అందిందట.

ఉమ తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఇలా మైలవరం, నందిగామ నియోజకవర్గాల రాజకీయాల్లో వేలు పెడుతూ.. అక్కడి టీడీపీ క్యాడర్‌ను కన్ఫ్యూజ్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో టీడీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Latest Articles

గోల్ఫింగ్ ప్రతిభ ప్రదర్శనకు గోల్డెన్ ఆపర్ట్యూనిటీ గోల్ఫ్ టోర్నీ – టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ ఘనంగా ప్రారంభం

దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్