30.2 C
Hyderabad
Friday, June 21, 2024
spot_img

బీజేపీ ఓట్ల లెక్కింపుల్లో తారుమారు చేసే వీలుందా?

   దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. అయితే, ఓట్ల లెక్కింపులో బీజేపీ అవకతవకలకు పాల్పడి ప్రజా తీర్పును మార్చే ప్రయత్నాల్లో ఉందంటూ కమలనాథులపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి పౌర సంస్థలు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రక్రియను కాపాడాలంటూ రిటర్నింగ్‌ అధికారు లకు పిలుపునిచ్చాయి. కౌంటింగ్‌ను నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా జరపాలను కోరుతున్నాయి.

   జూన్‌ 4న వెలువడే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య టగ్‌ ఆఫ్‌ వార్‌ నడిచిన నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందన్న ఆసక్తి నెలకొంది. 10 ఏళ్లుగా ప్రతిపక్ష పార్టీకే పరిమితమైన హస్తం నేతలు. ఇప్పటికైనా దేశాన్ని ఏలాలని కలలు కంటున్నారు. మోదీని గద్దె దించి అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, ఇప్పటికే రెండుసార్లు కేంద్రంలో చక్రం తిప్పిన బీజేపీ హ్యాట్రిక్‌ కొట్టాలన్న తపనలో ఉంది. ఇందుకోసమే ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడే ప్రయత్నాల్లో ఉందని పౌర సంస్థలు తీవ్ర ఆరోపణలు చేస్తు న్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియను కాపాడాలని కోరుతూ 120కిపైగా సంస్థలు దేశంలోని 543 స్థానాల్లోని రిటర్నింగ్‌ అధికారులకు పిలుపునిచ్చాయి. కౌంటింగ్‌ను నిష్పక్షపాతంగా బాధ్యతాయుతంగా నిర్వ హించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఇటీవల బెంగుళూరులో సంస్థలు సమావేశమయ్యాయి. పరకాల ప్రభాకర్‌, తీస్తా సెతల్వాడ్‌, మాజీ ఐఏఎస్‌ ఎంజీ దేవసహాయం, రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ ఓంభ త్కరే, క్యాబినెట్‌ సెక్రటేరియట్‌ రిటైర్డ్‌ జాయింట్‌ సెక్రటరీ రవిజోషి, ఫ్రాంకో థామస్‌, నూర్‌ శ్రీధర్‌ తదితరు లు ఈ సంస్థల తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఈ భేటీకి ఇండియా కూటమికి చెందిన ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా హాజరయ్యారు.

  సమావేశానికి హాజరైన సంస్థలు, పార్టీ నేతలంతా బీజేపీ అధికారం కోసం కుట్రలు చేస్తోందన్న అభిప్రాయా నికి వచ్చాక. ఎన్నికల ప్రక్రియను బాధ్యతాయుతంగా నడిపించాలని, కౌంటింగ్‌ను నిష్పక్షపా తంగా నిర్వహించాలని కోరుతూ లేఖ రాసింది. ఆ లేఖలో ఎన్నికల కోడ్‌ను అధికారపార్టీ బీజేపీ నేతలు ఉల్లం ఘిస్తున్నా ఈసీ చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొంది. అందువల్లే ఆర్‌వోలైనా ఎన్నికల ప్రక్రియ లోని తటస్థతను కాపాడాలంటూ పలు సూచనలు చేశాయి. పోలింగ్‌బూత్‌ల వారీగా పోలైన ఓట్ల వివరాలు నమోదయ్యే ఫాం 17C ప్రతీ అభ్యర్థి వద్దా ఉండేలా చూడాలని, ఫాం 17Cలోని వివరాలను సరిపోల్చే ఫాం బీ కూడా అభ్యర్థులకు జారీ చేయాలని, మొత్తం లెక్కింపు ప్రక్రియ అభ్యర్థుల సమక్షంలో జరిగేలా చూడాలని కోరింది. అంతేకాదు, వీడియో రికార్డింగ్‌ జరిపించాలని, ఓట్ల లెక్కింపులో ఎలాంటి తొందర పాటు పనికిరాదని, అవసరమైనప్పుడు ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకోవాలని సలహా ఇచ్చాయి. బీజేపీపై చేస్తున్న ఆరోపణలకు కౌంటర్‌ ఇస్తున్నారు కమలనాథులు. ఎన్నికల సంఘం, ఈవిఎంలపై కాంగ్రెస్ నాయకుల అనుమానాలు లాజిక్ లేకుండా వున్నాయని అఖిలేఖ్‌ మిశ్రా మండిపడ్డారు.

  మరోపక్క జూన్‌ 4వ తేదీన వెలువడే ఫలితాల కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈవీఎంలో నిక్షిప్తమైన ఫలితాలపై తమ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటంతో టెన్షన్‌లో ఉన్నారు అభ్యర్థులు. ఇక కౌంటింగ్‌కు సమయం ఆసన్నం కావడంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లులో మునిగారు. ఈ నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేశారు. మరో పక్క ఫలితాలపై దేశవ్యాప్తంగా బెట్టింగ్‌ జోరందుకుంది. పందేల కారణంగా లక్షలు కాదు. కోట్ల రూపా యలు చేతులు మారుతున్నాయి. మరోసారి బీజేపీ అధికారంలో వస్తుందని, మూడవసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేసి హ్యాట్రిక్‌ కొడతారన్న ధీమాలో ఉంది కాషాయ దళం. అటు ఇండియా కూటమి కూడా ఇదే రేంజ్‌లో తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. మరి ఎవరి కలలు నెరవేరు తాయి..? దేశాన్ని ఏలేది ఎవరు.? ఢిల్లీలో చక్రం తిప్పేది ఎవరన్నది తెలియాలంటే మాత్రం జూన్‌ 4న వరకూ వేచి చూడాల్సిందే.

Latest Articles

‘పోలీస్ వారి హెచ్చరిక’ లోగో లాంచ్ చేసిన డైరెక్టర్ తేజ

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై బెల్లి జనార్థన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘పోలీస్ వారి హెచ్చరిక’. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోను డైరెక్టర్ తేజ ఆవిష్కరించారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్