వరుసగా దిగివచ్చిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. తులం బంగారం రేటు ఇవాళ 250 రూపాయలకుపైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పెరగడమే ఇందుకు కారణం గా తెలుస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 270 పెరిగి రూ. 72 వేల 700 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 250 పెరిగి రూ. 66 వేల 650 వద్దకు చేరింది. ఇక, వెండి కూడా బంగారం దారిలోనే నడిచింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర 15 వందలు మేర పెరిగింది. దీంతో కిలో వెండి రేటు ప్రస్తుతం రూ. 97 వేల 500 స్థాయికి చేరింది.