27.9 C
Hyderabad
Tuesday, June 25, 2024
spot_img

రాష్ట్రంలో డబుల్ ఆర్ ట్యాక్స్ రాజకీయం నడుస్తోందా?

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆపరేషన్ సౌత్‌ని చేపట్టింది కమలదళం. ఉత్తరాది మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న బీజేపీకి దక్షిణ భారతం మాత్రం అంతు చిక్కడం లేదు. అందుకే, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిన పట్టు బిగించేందుకు పక్కా వ్యూహాలతో ఆపరేషన్‌ సౌత్‌ను రెడీ చేశారు బీజేపీ అగ్రనేతలు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అంతేనా, రాష్ట్రంలో డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందని సాక్షాత్తు ప్రధాని విమర్శించడంతో ఇప్పడు డబుల్ ఆర్ ట్యాక్స్ మీద రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

లోక్‌సభ ఎన్నికల వేళ..రెండు తెలుగు రాష్ట్రాలపై కమలదళం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా ఏపీ, తెలంగాణ లో మెజార్టీ సీట్లు గెలిచి సత్తా చాటాలని కమల నాథులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే అగ్రనేతలంద రూ ఒకరి తర్వాత ఒకరు రెండు తెలుగు రాష్ట్రాలకు క్యూ కడుతున్నారు. భారీ బహిరంగ సభలు, రోడ్‌ షోలతో ప్రచా రాన్ని హోరెత్తిస్తున్నారు. పోలింగ్ కు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ కావడంతో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓవైపు మోదీ, మరోవైపు జేపీ నడ్డా, ఇంకోవైపు అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తు న్నారు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్న చందంగా ఆపరేషన్ సౌత్ వ్యూహాన్ని అమలు చేసి ఎన్నికల యుద్ధంలో గెలిచి నిలవాలనుకుంటున్నారు.

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ రాజన్న సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. డబుల్ ఆర్ ట్యాక్స్ పేరిట రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుం టోందని ఆయన ఆరోపించారు. ఆర్ ఆర్ లో ఒక ఆర్ అంటే రాహుల్ గాంధీ అని, రెండో ఆర్ రేవంత్ రెడ్డి అని మోదీ చెప్పారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన సొమ్ము కొంత భాగం ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులకు, మరికొంత హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులకు వెళ్తోందని ఆరోపిం చారు. కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాలు ఆ పార్టీకి ఏటీఎంలుగా మారిపో తాయని మోదీ చెప్పారు.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్..తీరా అధికారంలోకి వచ్చాక పంద్రాగస్ట్ వరకు వాయిదా వేసిందని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన అన్నీ హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకుందా అని మోదీ ప్రశ్నించారు. మహిళలకు 2వేల500 పన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిందని ఇప్పటివరకు ఆ హామీని పట్టించుకున్న పాపానపోలేదని మోదీ ఫైర్ అయ్యారు. మొత్తానికి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్న చందంగా ఆపరేషన్ సౌత్ వ్యూహాన్ని అమలు చేసి ఎన్నికల యుద్ధంలో గెలిచి నిలవాలనుకుంటున్నారు. మరి ఎన్నికల చదరంగంలో బీజేపీ పాచికలు పారుతాయా.? తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సాధిస్తుందా.? కమలనాథుల ఆపరేషన్ సౌత్ వ్యూహం వర్క్ ఔట్ అవుతుందా! అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Latest Articles

ఎవడి ఛాన్స్ వాడిదే …అప్పుడు వాళ్లు …ఇప్పుడు వీళ్లు

అప్పడు వైసీపీ వంతు.. ఇప్పుడు టీడీపీ కూటమి టైం! వాళ్లూ అక్రమ కట్టడాలను కూల్చామని చెప్పారు.. వీళ్లూ అదే మాట అంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, మరి ఇంత జరుగుతుంటే అధికారు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్