Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి క్లీన్ స్వీప్ సాధ్యమా ?

    యూపీని కొడితే ఢిల్లీ గద్దెపై పాగా వేసినట్లే. అన్నిపార్టీల నిశ్చితాభిప్రాయం ఇది. అందుకే బీజేపీ ఉత్తర ప్రదేశ్ లో 80 కి 80సీట్లు గెలుస్తామంటూ ప్రచారంలో ఊదరగొడుతోంది. ఫలితంగా రాష్ట్ర రాజకీయాలు రసవత్తర ఘట్టానికి చేరాయి. ఇండియా కూటమి బలమైన పోటీ ఇస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నవేళ 80 సీట్లు సాధ్యమా! ఒకపక్క ప్రభుత్వ వ్యతిరేకత, మరోపక్క ముస్లీంలను పూర్తిగా దూరం పెట్టిన బీజేపీ.. ఏ ధైర్యంతో 80 అంటోంది. పౌరసత్వ సవరణచట్టం, రామ మందిరంతో ఓట్లు కొల్లగొట్టవచ్చని భావిస్తోందా.. లోక్ సభ ఎన్నికల వేళ అన్నీ ప్రశ్నలే.

   లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. ఇక్కడ ఆధిక్యం సాధించే పార్టీయే దాదాపుగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 80 సీట్లను లక్ష్యంగా చేసుకుని బరిలోకి దిగింది కమలం పార్టీ. నరేంద్ర మోడీ ప్రభంజనం పెద్ద ఎత్తున వీచిన 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అత్యధికంగా 73 సీట్లను కైవసం చేసుకుంది. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 62 సీట్లకు పరిమితమైంది. ఈసారి ఉత్తర ప్రదేశ్‌లో ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో బీజేపీ పలుకుబడి తగ్గిందన్న వార్తలు వస్తున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో బీజేపీ అచ్చంగా హిందూత్వ అజెండాపైనే ఆధారపడుతోంది. కాగా కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మాత్రం ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో బరిలోకి దిగింది. ఈ ప్రాంతంలో 40 శాతం నుంచి 50 శాతం మధ్య ముస్లింల ఓట్లుంటాయి. సహజంగా ఉత్తరప్రదేశ్‌లోని ముస్లింలకు సమాజ్‌వాదీ పార్టీ అతి పెద్ద ఓట్‌ బ్యాంక్‌గా ఉంటుంది. ములాయం సింగ్ యాదవ్ హయాం నుంచి ఇక్కడి ముస్లింలు, సమాజ్‌వాదీ పార్టీకి ఓటేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా పశ్చిమ యూపీ లోని ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి జై కొట్టారన్న వార్తలు రాజకీయవర్గాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

    యోగి ఆదిత్యనాథ్ హయాంలో తమపై దాడులు పెరిగాయని ముస్లీం సంస్థలు ఆరోపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ విషయంలోనూ ముస్లీంలలో మెజారిటీ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది.పశ్చిమ యూపీలో జనాభా పరంగా చూస్తే ముస్లిం మైనారిటీల తరువాతి స్థానం దళితులదే. ప్రధానంగా నగీనా నియోజక వర్గంలో దళితుల ప్రాబల్యం ఎక్కువ. 1989లో బహుజన్ సమాజ్‌పార్టీ అధినేత్రి మాయావతి నగీనా సెగ్మెంట్‌ నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి ఎన్నికలలో మాయావతి నాయకత్వం లోని బహుజన్ సమాజ్ పార్టీ ఇటు ఎన్డీయే కూటమికి అటు ఇండియా కూటమికి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీపై దళితులు నారాజ్ గా ఉన్నారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. బీజేపీపై దళితులకు పెరిగిన వ్యతిరేకత తమకు లాభిస్తుందని ఇండియా కూటమి భావిస్తోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రాజ్‌పుత్‌ సామాజిక వర్గం కూడా ఎక్కువ. సహజంగా బీజేపీకి రాజ్‌పుత్‌లు అనుకూలంగా ఉంటారు. అయితే ఈసారి కమలం పార్టీపై రాజ్‌పుత్‌ సామాజికవర్గం ఆగ్రహంగా ఉంది. టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని రాజ్‌పుత్‌లు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో ఈసారి రాజ్‌పుత్‌లకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. ఈ విషయమై రాజ్‌పుత్‌లు ఏకంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దగ్గర పంచాయితీ పెట్టారు. అయినప్పటికీ తమకు న్యాయం జరగలే దని రాజ్‌పుత్‌ సామాజికవర్గం మండిపడింది.

    ముస్లింలు, దళితుల తరువాత పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రాజ్‌పుత్‌ల జనాభాయే ఎక్కువ. మొత్తం పశ్చిమ యూపీ జనాభాలో రాజ్‌పుత్‌ సామాజికవర్గం పది శాతం వరకు ఉంటుంది. అంతేకాదు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువ. ఈసారి గాజియాబాద్‌లో రాజ్‌పుత్ సామాజికవర్గానికి చెందిన జనరల్ వీకే సింగ్‌కు బీజేపీ టికెట్ లభిస్తుందని అందరూ భావించారు. అయితే చివరిక్షణంలో ఆయనకు టికెట్ దక్కలేదు. ఈ పరిణామం రాజ్‌పుత్ సామాజిక వర్గానికి మింగుడుపడలేదు. మేనకా గాంధీ తనయుడు, సీనియర్ బీజేపీ నేత ఫిరోజ్ వరుణ్‌ గాంధీకి ఈసారి పార్టీ టికెట్ ఇవ్వలేదు. వరుణ్ గాంధీ పిల్‌భిత్ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎంపీ. కొంతకాలంగా బీజేపీ అగ్రనాయకత్వంపై వరుణ్ గాంధీ ఎడాపెడా విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా యోగి ఆదిత్య నాథ్ సర్కార్ విధానాలపై అనేకసార్లు ఘాటు విమర్శలు చేశారు. దీంతో పార్టీ కొంతకాలం నుంచే బీజేపీ హస్తిన పెద్దలు వరుణ్‌ గాంధీని పక్కన పెట్టారు. వరుణ్ గాంధీకి బదులుగా యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న జితిన ప్రసాద్‌కు పిల్‌భిత్ టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం.ఈ పరిణామంతో పిల్‌భిత్ నియోజకవర్గంలో వరుణ్‌ గాంధీకి సానుభూతి తెచ్చిపెట్టింది. అంతిమంగా వరుణ్‌ గాంధీకి టికెట్ ఇవ్వకపోవడం నియోజకవర్గంలో బీజేపీకి మైనస్ పాయింట్ అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

   ఉత్తరప్రదేశ్‌లోని 16 నియోజకవర్గాల్లో బీజేపీ గడ్డు సమస్య ఎదుర్కొంటోంది. రాయ్‌బరేలీ, అమేధీ, ఫైజాబాద్, అంబేద్కర్ నగర్, కౌశంబి సహా మరికొన్ని నియోజకవర్గాల్లో కమలం పార్టీ విజయం అంత సులువు కాదు. అయితే ఎంఐఎంవంటి ఇతర పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చడంతో బీజేపీ లాభపడిన సందర్భాలు ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ హయాంలో తమపై దాడులు పెరిగాయని ముస్లీం సంస్థలు ఆరోపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ విషయం లోనూ ముస్లీంలలో మెజారిటీ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. సీఎఏ ను మెజారిటీ ప్రతి పక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో నిరుద్యోగం, పేదరికం అతి ప్రధాన సమస్యలు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పాలనలో మతపరమైన వివక్ష పెరిగిపోయిందన్న విమర్శ లున్నాయి. బుల్‌డోజర్‌ పాలిటిక్స్‌ ను సమాజంలోని ఒక వర్గం వ్యతిరేకిస్తోంది. నేరస్తులను న్యాయస్థానా లకు అప్పజెప్పకుండా పోలీసులే కాల్చి చంపడంపై పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇదిలా ఉంటే ఎలెక్టోరల్ బాండ్లను రాజ్యాంగ విరుద్దంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో సామాన్యప్రజల్లో కేంద్ర ప్రభుత్వం చులకన అయింది. అంతేకాదు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను నరేంద్ర మోడీ సర్కార్ దుర్వినియోగపరుస్తోందన్న చర్చ మేధావి వర్గాల్లో మొదలైంది. ఇవన్నీ భారతీయ జనతా పార్టీ విజయాలకు అవరోధాలే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏమైనా ఈసారి ఉత్తరప్రదేశ్‌ లో లోక్‌సభ ఎన్నికలు ఇటు సమాజ్‌వాదీ పార్టీ నాయకత్వంలోని కూటమికి అటు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్