22.7 C
Hyderabad
Sunday, October 26, 2025
spot_img

ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌ ప్రమాదం

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించారు. మానవరహిత విమాన గాలింపులో కనుగొన్నట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తాసంస్థ తెలిపింది. తావిల్‌ అనే ప్రాంతంలో హెలికాప్టర్‌ కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతానికి సహాయక బృందాలను పంపారు. మరోవైపు టర్కీకి చెందిన అకింజి అనే UAV కాలుతున్నట్లుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించింది. అది హెలికాప్టర్‌ కూలిన ప్రాంతమేనని అనుమానిస్తున్నారు. ఈ సమాచారాన్ని ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ కమాండర్‌ ధ్రువీకరించారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అయినప్పటికీ రైసీ ఆచూకీ గుర్తించడం కోసం ప్రత్యేక దళాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. పొగ మంచు, వర్షం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. తూర్పు అజర్‌ బైజాన్‌ రాష్ట్రంలోని వర్జాకాన్ నగరానికి సమీపంలో ఉన్న అడవుల్లో సైనిక బలగాలు ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నాయి. ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ నిన్న ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌ అధ్యక్షుడి క్షేమ సమాచారం కోసం పలు దేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. హెలికాప్టర్‌ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌-అజర్‌బైజాన్‌ సరిహద్దుల్లో కిజ్‌ కలాసీ, ఖొదావరిన్‌ అనే రెండు డ్యాంలను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్