35.2 C
Hyderabad
Sunday, May 11, 2025
spot_img

అమెరికాలో టోర్నడో బీభత్సం… 23 మంది మృతి

Tornado disaster in America| అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. తాజాగా మిసిసిపి రాష్ట్రంలో ఏర్పడిన భారీ టోర్నడో అల్లకల్లోలం సృష్టించింది. దీని ప్రభావంతో ఇప్పటివరకు 23 మంది మృత్యువాత పడ్డారు. రాత్రివేళ సంభవించడంతో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. మిసిసిపి ప్రజల పాలిట పీడకలగా మారిన టోర్నడో ప్రభావంతో అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. జనజీవనం స్తంభించింది. భారీగా ఆస్తినష్టం సంభవించింది. మిసిసిపి రాష్ట్రంలోని అనేక పట్టణాలు నామరూపాల్లేకుండా పోయాయి. ప్రకృతి విలయతాండవంతో ఎక్కడ చూసినా శిథిలాల గుట్టలు, విరిగిపడిన చెట్లు, ధ్వంసమైన కార్లు, వాహనాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపిస్తున్నాయి. పలు పట్టణాల్లో లక్షలాది మంది చీకటితో కొట్టుమిట్టాడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఫుట్ బాల్ అంత సైజులో వడగళ్లు కూడా పడినట్టు అధికారులు గుర్తించారు. కుప్పకూలిన భవనాల శిథిలాల కింద పెద్ద సంఖ్యలో ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.

 


Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్