కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా తెలంగాణభవన్ వద్ద బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నిరసనలు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీశారు. రైతుబంధు గోవిందా.. తులం బంగారం గోవిందా అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా బీఆర్‌ఎస్ నేతలు అదానీ-రేవంత్ ఫొటోతో ఉన్న టీ షర్ట్స్ ధరించి సమావేశాలకు వచ్చారు. ఈ సందర్బంగా అసెంబ్లీ గేటు వద్ద వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం, వారిని తెలంగాణ భవన్ వద్ద వదిలేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నేతలు నిరసనలు తెలిపారు.