కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంట్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆరు స్లబ్స్‌లో చార్జీల భారం ప్రజలపై మోపిందని మండిపడ్డారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కంటైనర్ షిప్‌లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారు అని విమర్శించారు. సీబీఐ విచారణ జరిగిన తీరుపై ప్రధాని, హోం మంత్రికి లేఖల రాస్తానని చెప్పారు.