TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తరుణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకులు సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటాయని వ్యాఖ్యానించారు. గతంలో కూడా టెన్త్, ఇంటర్ పేపర్లు కూడా లీకయ్యాయి కదా అని తేలిగ్గా మాట్లాడారు. పేపర్ లీక్‌లో మంత్రి కేటీఆర్ హస్తం ఉందనడం సరి కాదన్నారు. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే పేపర్ లీకులు సర్వ సాధారణమన్న ఆయన వ్యాఖ్యలపై నిరుద్యోగులు, ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
Read Also: పేపర్ లీక్ దర్యాప్తులో సిట్ దూకుడు.. బండి సంజయ్ కి నోటీసులు
Follow us on: Youtube Instagram