ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ-జనసేన నేతల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ-జనసేన పొత్తుపై ఆ పార్టీ సీనియర్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు. పేరుకే రెండు పార్టీల మధ్య పొత్తు అన్నట్లుగా పరిస్థితి తయారైందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపాలని పవన్ కల్యాణ్ ను అడిగినా ఆయన నుంచి స్పందన లేదని హాట్ కామెంట్స్ చేశారు. తమతోనే పవన్ కలిసి రావడం లేదని ఆయన ఆరోపించారు. బీజేపీతో సన్నిహితంగా ఉన్నామన్న సంకేతాలను వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందని.. దీంతో బీజేపీ, వైసీపీ ఒకటేనని ప్రజలు నమ్ముతున్నారని వెల్లడించారు మాధవ్.