అక్రమ వలసల అంశంపై అనుకున్నంత పని చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా అక్రమ వలసల పేరుతో టెక్సాస్ నుంచి 205 మంది భారతీయులను విమానంలో స్వదేశానికి తరలించింది ట్రంప్ సర్కార్. సీ – 17 యూఎస్ మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ లో భారతీయులను తరలించింది ట్రంప్ సర్కార్. పంజాబ్లోని అమృత్‌సర్ కు సదరు విమానం చేరుకుంటుంది.
వలసల అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటినుంచీ కఠినంగానే ఉన్నారు. ఎన్నికల ప్రచార సమయంలోనే వలసలనే కీలకాశం చేశారు ట్రంప్. తాను అధ్యక్షుడిని అయితే అమెరికా చరిత్రలోనే అతి పెద్ద బహిష్కరణ కార్యక్రమాన్ని చేపడతానని ఎన్నికల ప్రచారంలో వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత తాను అనుకున్నది చేసేస్తున్నారు ట్రంప్. ఈ విషయంలో భారత్ కు కూడా ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదు ట్రంప్ మహాశయుడు.
సహజంగా ట్రంప్ తొలి టర్మ్‌లో అమెరికా, భారత్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా ట్రంప్‌నకు వ్యక్తిగతంగా స్నేహం ఉంది. అయితే వలసల విషయంలో ఈ ములాజా ఏమీ పనిచేయలేదు. తాజాగా అక్రమ వలసల పేరుతో టెక్సాస్ నుంచి 205 మంది భారతీయులను విమానంలో స్వదేశానికి తరలించింది ట్రంప్ సర్కార్. సీ – 17 యూఎస్ మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ లో భారతీయులను తరలించింది ట్రంప్ సర్కార్. పంజాబ్లోని అమృత్‌సర్ కు సదరు విమానం చేరుకుంటుంది.
కాగా వలసల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న కఠిన నిర్ణయాలను భారత్ కూడా ఆమోదించింది. అక్రమ వలసలకు తాము కూడా వ్యతిరేకమని భారత్ స్పష్టం చేసింది. అక్రమ వలసల అంశం…అనేకానేక వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. కథ అక్కడితో ఆగలేదు. వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాలో ఉంటే…వారిని స్వదేశానికి తీసుకురావడానికి వీలు కల్పిస్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే, అమెరికాలో సరైన ధృవపత్రాలు లేకుండా భారత్ కు చెందిన వలసదారులు 7,25,000 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 18,000 మందిని భారత్ కు తరలించడానికి అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ఒక జాబితాను రూపొందించింది. ఇప్పటికే గటేమాలా, పెరు, హోండూరస్ తదితర దేశాలకు పలువురిని అమెరికా విమానాల్లో తరలించింది ట్రంప్ సర్కార్.ఇదిలా ఉంటే ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా పర్యటన పెట్టుకున్నారు. ఈనెల 13వ తేదీన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఈ భేటీలో అక్రమ వలసలు అంశం కీలకం కానుంది.