జనవరి 2 , 3 తేదీల్లో కేరళలో పర్యటించనున్న కవిత
జనవరి 2,3వ తేదీల్లో ఎమ్మెల్సీ కవిత కేరళలో పర్యటించనున్నారు. కేరళలోని కన్నూరులో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనంటారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కవితను ఆహ్వానించారు. 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు ఆమె హాజరవుతారు. 3వ తేదీన సంస్కృతిపై జరిగే చర్చలో పాల్టొనున్నట్లు తెలిపారు. ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాలను కేరళ సీఎం పినరాయి విజయన్ ప్రారంభిస్తారు