- 108 రన్స్‌కే కుప్పకూలిన న్యూజిలాండ్
- భారత పేసర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయిన కివీస్
రాయ్ పూర్ వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 109 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ శర్మ సేన కేవలం 20.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 40 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-0తో దక్కించుకుంది. సిరీస్ లో భాగంగా చివరి వన్డే ఈ నెల 27న జరగనుంది.