Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

మాణిక్యం దిద్దిన (కాంగ్రెస్) కాపురం

మాణిక్కం ఠాగూరు చేయలేకపోయిన పనిని మాణిక్ రావు ఠాక్రే చేయగలిగారు. తెలంగాణా కాంగ్రెస్ లో ఠాక్రే మంత్రం బానే వర్కవుట్ అవుతోంది. పీసీసీ చీఫ్  గా రేవంత్ రెడ్డి ఎన్నికైన క్షణం నుంచి కారాలూ, మిరియాలూ నూరుతూ కూర్చున్న  కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఏడాది తర్వాత గాంధీ భవన్ కు వచ్చారు. వచ్చి రేవంత్ రెడ్డితో కాసేపు భేటీ కూడా అయ్యారు. మరిద్దరి డార్లింగ్స్ మధ్య ఏమేమి పాటలు దొర్లాయి? ఏమేమి డ్యూయెట్లు సాగాయి? అన్నవి తర్వాత కథలో సాగే మలుపులను బట్టి తేలుతుంది.

తెలంగాణా రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ప్రజల్లో అభిమానం ఉన్నా, గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. ఈసారి మాత్రం తప్పక రావాలని కసిగా ఎదురుచూస్తోంది.  అందుకోసం మంచి వాగ్ధాటి పటిమ ఉన్న రేవంత్ రెడ్డిని ఏకంగా పీసీసీ ప్రెసిడెంట్ ని చేసింది. ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీకి గొడ్డు చాకిరీ చేసిన వారిని వదిలేసి, వేరే పార్టీలోంచి వచ్చిన వాళ్లకి అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని సీనియర్లు అలిగారు. అటకెక్కి కూర్చున్నారు. మనకు లేనప్పుడు, పార్టీ గురించి ఎవడాలోచిస్తాడని చాలామంది బాహాటంగానే అసమ్మతి జ్వాలలు మండించారు.

దీంతో రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ  హోం గార్డులు ఎన్నేళ్లు ఉద్యోగం చేసినా ఎస్పీలు కాలేరు అంటూ సెటైర్ వేశారు. దీంతో మర్రిశశిధర్ రెడ్డి పార్టీ వీడుతూ హోంగార్డుగా కొనసాగాలనుకోవడం లేదన్నారు.

ఈ సీన్ లో భాగంగానే కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయారు కూడా. అయితే స్వయానా సోదరుడు కావడంతో వెంకటరెడ్డి ఏం చేశాడంటే, అటూ ఇటూ ప్రచారం చేయకుండా చక్కగా విదేశాలకు వెళ్లి కాలక్షేపం చేశారు.

ఈ క్రమంలో నేనిక రానంటూ శపథం చేసిన ఆయన ఏడాదిగా గాంధీభవన్ కి రాలేదు. ఢిల్లీ నుండి పార్టీ దూతలు వచ్చినా అక్కడ అడుగుపెట్టలేదు.

దిగ్విజయ్ సింగ్ వచ్చినా సరే, హోటల్ లో కలిసి తాను చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోయారు. ఈ క్రమంలో మాణిక్కం ఠాగూర్ రేవంత్ రెడ్డికి మద్దతుగా వ్యవహారాలు నడుపుతూ సీనియర్లను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలతో ఆయన్ను బదలీ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన ఠాక్రే తోనూ కోమటి రెడ్డి గాంధీ భవన్ లో కాకుండా వేరే చోట కలిశారు.

సీనియర్లు ఇలా చెరో దిక్కూ లాగేస్తే ఎన్నికల ఏడాదిలో పార్టీని ముందుకు నడిపించడం కష్టమే అనుకున్న ఠాక్రే, తాను వచ్చిన క్షణం నుంచే రిపేర్ వర్క్ మొదలు పెట్టారు. ఒకొక్కరితో విడి విడిగా భేటీ అవుతూ ఎన్నికల్లో గెలిచే వరకు అందరూ కలిసే ఉండాలని ఉపదేశిస్తూ నడుపుకొస్తున్నారు.

నల్లగొండ జిల్లాపై మంచి పట్టు ఉన్న కోమటి రెడ్డి వెంకట రెడ్డి వంటి సీనియర్ల అండ ఉంటేనే పార్టీ విజయాలు సాధించగలుగుతుందని ఠాక్రే భావిస్తున్నారు. అందుకే  కోమటి రెడ్డికి స్వయంగా ఫోను చేసి గాంధీ భవన్  వచ్చి  పీసీసీ అధ్యక్షుడితో ఒక్కసారి భేటీ కావాలని కోరారట.

అటు రేవంత్ కు కూడా ఫోన్ చేసిన ఠాక్రే  కోమటి రెడ్డితో మర్యాదగా వ్యవహరించాలని  సూచించారట. ఎన్నికల ఏడాదిలో ఈగోలు పక్కన పెడితేనే రేపు అధికారం వస్తుందని అందరూ గుర్తించాలని చెప్పారట. మొత్తానికి అటు కోమటి రెడ్డి ఇటు రేవంత్ రెడ్డి కూడా ఠాక్రే మంత్రానికి ఓకే అన్నారు.

ఏది ఏమైతేనేం ఠాక్రే వ్యూహం అయితే పనిచేసింది. ఇది పార్టీకి మంచే చేస్తుందని అంటున్నారు హస్తం నేతలు. భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఎలా గెలిపించాలో నాకు తెలుసునని అన్నారు. అవసరమైతే పాదయాత్ర చేస్తానని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీలో అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇంకేముంది అంతా కలిసిపోయారు…ఇక లవ్వూ, డూయెట్టే అంటున్నారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్