భారతదేశంలో ఆహార ఉత్పత్తులు సమృద్ధిగా ఉన్నాయని, ఇది ఆహార మిగులు దేశం అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇప్పుడు భారత్ ప్రపంచ ఆహార భద్రత కోసం కృషి చేస్తోందని చెప్పారు. భారతదేశం రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. దిల్లీలో వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు.