పాకిస్తాన్‌లో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. వేలాదిమంది హిందువులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఈ కార్యక్రమం జరిగింది. ముస్లిం ఆధిపత్యం ఉన్న దేశంలో హిందూ సమాజం తన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించింది. సాధారణంగా ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర అట్టహాసంగా జరుగుతుంది. అయితే ఇదే సాంప్రదాయాన్ని పాకిస్తాన్‌లో కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ జగన్నాథ రథయాత్ర వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మతపరమైన జెండాలతో పాటు పాకిస్తాన్ జెండాలను ప్రదర్శించారు. పాకిస్తాన్‌లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో హిందువుల సంఖ్య పరిమితంగా ఉంది. ఎక్కువగా హిందువులు సింధ్ ప్రావిన్సులో ఉన్నారు.