- వరల్డ్ పాప్యులేషన్ రివ్యూ తాజా నివేదిక వెల్లడి
- ఇండియాలో పెరుగుతున్న యువతరం
జనాభాలో డ్రాగన్ చైనాను వెనక్కి నెట్టేసింది భారత్. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ అవతరించింది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ తాజా నివేదిక ఈ విషయం వెల్లడించింది. చైనాలో జననాల రేటు బాగా తగ్గినట్లు ఇటీవల కొన్ని అంతర్జాతీయ సంస్థల నివేదికలు వెల్లడించాయి. తాజాగా భారత్ జనాభా 142.3 కోట్లకు చేరుకున్నట్లు వరల్డ్ పాపులేషన్ రివ్యూ తాజా నివేదిక పేర్కొంది. 1960 తర్వాత తొలిసారి చైనాలో జనాభా తగ్గింది.
భారతదేశం మొత్తం జనాభాలో 50 శాతానికిపైగా 30 ఏళ్ల లోపు వారే ఉండటం విశేషం. అంటే సగం మందికిపైగా యువతే ఉంది. దీంతో, భారత్ ను ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా నిపుణులు అంచనా వేస్తున్నారు.