సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
కాంగ్రెస్ అబద్దపు హామీలతో… అమలుకు సాధ్యంకాని పథకాలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని అన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. రైతు భరోసా కోసం బీజేపీ అధిష్టానం ఇచ్చిన మేరకు.. సిద్ధిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ లు రైతులకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆదరిస్తున్నారని… రైతును అన్ని విధాలా ఆదుకుంటామని చెప్తున్న ఎమ్మెల్యే
ఉప్పల్ స్టేడియం దగ్గర మొదలైన ఐపీఎల్ సందడి
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర ఐపీఎల్ మ్యాచ్ సందడి మొదలైంది. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నా అవేమీ లెక్క చేయకుండా క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియం వైపు తరలివస్తున్నా రు. తమ అభిమాన ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీని ఒక్క సారైనా చూడాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇప్పటి వరకు రెండు టీమ్‌ల మధ్య జరిగిన మ్యాచుల్లో ధోనీ సేన సన్ రైజర్స్ పై దండ యాత్ర చేస్తూ వచ్చింది. ఈరోజు కూడా మళ్లీ అదే రిపీట్ చేయాలనీ చెన్నై టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇక హైదరాబాద్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో ఐపీఎల్ రికార్డులు బద్దలు కొట్టిన SRH కూడా మళ్లి అదే జోష్ ను కొనసాగించాలని చూస్తోంది. ఉప్పల్ స్టేడియం దగ్గర కొనసాగుతున్న ఐపీఎల్ సందడి గురుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితను విచారించేం దుకు సీబీఐ రంగంలోకి దిగింది. లిక్కర్ స్కాం కేసులో విచారణకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. కాగా.. లిక్కర్ పాలసీ కేసులో కవితను విచారించాల్సిన అవసరముందని సీబీఐ పిటిషన్లో పేర్కొంది.ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను మార్చి 15న అదుపులోకి తీసు కుని కొన్ని రోజుల పాటు విచారించింది. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు. తాజాగా తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. న్యాయస్థానం విచారణకు అనుమ తించింది. ఇదే కేసులో కవితకు గతంలో కూడా సీబీఐ నోటీసులు ఇచ్చింది. తమ ఎదుట హాజరు కావాలని కోరింది. కానీ హాజరుకాలేదు. తాజాగా సీబీఐ కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. కోర్టు అనుమతితో… సీబీఐ కవితను విచారించనుంది.


