Free Porn
xbporn
24.2 C
Hyderabad
Thursday, July 25, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

బిజీబిజీగా సీఎం రేవంత్

ఢిల్లీలో టూర్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. ఈనేథ్యంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. అంతకు ముందు అధిష్టాన పెద్దలతో సమావేశం అయి పలు అంశాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, సురేష్‌ కుమార్ షట్కార్, కిరణ్‌ కుమార్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.

ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ వెస్ట్‌ జోన్ పరిధిలో పోలీసులు అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇన్నాళ్లు మూలన పెట్టిన లాఠీలను చేతుల్లోకి తీసుకున్నారు. గత మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కొన్నేళ్లుగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ పోలీసుల చేతులు కట్టేయడంతో రౌడీలు, మందుబాబులు, ఆవారాగాళ్లు రెచ్చిపోయారు. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. ఈనేపథ్యంలోనే కఠిన చర్యలకు పోలీసులు శ్రీకారం చుట్టారు.

పిచ్చికుక్క దాడి

ఉమ్మడి నెల్లూరు జిల్లా పాలకొండ సత్రం గ్రామంలో పిచ్చికుక్క రెచ్చిపోయాయి. నిన్న రాత్రి గ్రామంలోని ప్రతి ఇంట్లో చొరబడి 15 మందిని తీవ్రంగా గాయపరిచాయి. గాయపడ్డ వారిలో ఎనిమిది మంది మహిళ లు, ఏడు మంది పురుషులు ఉన్నారు. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుక్కల స్వైరవిహారంపై అధికారులకు అన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బార్ లో అగ్రిప్రమాదం

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ బార్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో బార్‌లోని ఖరీదైన మద్యం బాటిల్స్ ప్రమాదంలో కాలిపోయినట్లు సమాచారం. సకా లంలో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

అక్రమ కట్టడాలు కూల్చివేత

తిరుపతి రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న అక్రమ కట్టడాలను కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. గత కొన్ని సంవత్స రాలుగా రాజకీయ నాయకుల అండదండలతో కొందరు స్టేషన్ ఎదుట అక్రమంగా షాపులు నిర్మించుకున్నారు. మాముళ్ల మత్తులో ఇన్నాళ్లు అధికారులు పట్టించుకోలేదు. ప్రభుత్వం మారగానే అధికారులు అక్రమ కట్టడాలను తొలగించే పనిలో పడ్డారు. మరోవైపు ప్రభుత్వ తీరుపై బాధితులు మండిపడ్డారు.

పబ్లిక్ లో పాముల సయ్యాట

రెండు పాములు ఒకదానికి ఒకటి చుట్టుకున్న సంఘటన నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలోని ఓ సబ్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. నిన్న రెండు పాములు పెన వేసుకున్నాయి. ఆ దృశ్యాలను చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. రెండు పాములు పడగలు విప్పి ఒకదానికి ఒకటి పెనవేసుకున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

హీరోయిన్ అనన్యను భయపెట్టిన ఫేక్ కాల్స్

సోషల్ మీడియా ప్రభావంతో ఇటీవల అమ్మాయిలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హీరోయిన్ అనన్య నాగళ్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలుపుతూ ఓ వీడియో షేర్ చేసింది. మూడు రోజుల క్రితం సిమ్ పేరుతో నేరాలకు పాల్పడుతున్నారని, తనకు కాల్ చేసి భయపెట్టారని చెప్పారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హీరోయిన్ సూచన చేశారు.

విద్యార్థి అనుమానాస్పద మృతి

హైదరాబాద్ పేట బషీర్‌బాగ్‌లో విషాదం చోటుచేసుకుంది. కొంపల్లి శ్రీచైతన్య పాఠశాల కే4 క్యాంపస్ హాస్టల్‌లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి మల్లీఖార్జున్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. నిన్న రాత్రి భోజనం చేసి నిద్ర పోయిన విద్యార్థి, ఉదయం నిద్రలేవకపోడంతో సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

కోదండరామస్వామి వార్షికోత్సవం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి శ్రీకోదండరామ స్వామి 50వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనేపథ్యంలోనే ఆలయ అధికారులు మూడు రోజుల పాటు పూజా క్రతువులు నిర్వహించారు. చివరి రోజైన నిన్న కుంభ ఆవాహనం, మహా కుంభాభిషేకం, పూర్ణాహుతి, మహాదాశ్వీరచనంతో పాటు శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా చేపట్టారు. అనంతరం నారాయణ సేవలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Latest Articles

బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత తొలిసారి సభకు కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఇవాళ తెలంగాణ బడ్జెట్ సమాశాలకు హాజరుకానున్నారు. బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత తొలిసారి ప్రతిపక్ష నేతగా శాసనసభలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్‌ రాకపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఏం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్