25.7 C
Hyderabad
Sunday, April 27, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

ప్రభుత్వ నిధులతో పవర్ బోర్ వెల్

కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గణేష్ తెలిపారు. పికెట్ సుబ్బారావు నగర్‌లో ప్రభుత్వ నిధులతో మంజూరైన పవర్ బోర్ వేల్‌ను స్థానిక నాయకు లతో కలిసి ఆయన ప్రారంభిం చారు. నియోజకవర్గంలో ఏలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురా వాలన్నారు. గత ప్రభుత్వ నాయకులు నియోజ కవర్గాన్ని అభివృద్ధి చేయకుండా, కాలయాపన చేశార న్నారు.

ఆకస్మిక తనిఖీలు

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో తాత్కాలిక వంతెన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ దివాకర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్వరగా వంతెన నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణంలో నాణ్య త లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సీతారాముల విగ్రహాలు

మేడ్చల్‌ జిల్లా డబుల్‌ పూర్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు సీతారాముల విగ్రహాలను ధ్వంసం చేశారు. హనుమాన్ గుట్ట సీతారాముల ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారని స్థానికులు తెలిపా రు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

స్కూల్ వ్యాన్ బీభత్సం

అంబర్పేట తిలక్ నగర్‌లో ప్రైవేట్ స్కూల్ వ్యాన్ బీభత్సం సృష్టించింది. వెల్డింగ్‌ షాప్‌, టీ స్టాల్స్‌లోకి దూసుకెళ్లడంతో దుకాణాల్లోని సామగ్రి ధ్వంసమైంది. స్కూల్‌ విద్యార్థులను ఎక్కిచుకోవడానికి వెళుతుండ గా ఈ ఘటన చోటుచేసుకుంది. మితిమీరిన వేగం, నిర్లక్షం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.

బావ గొంతు కోసిన బావమర్ధి

కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మేంగారం వద్ద నవీన్ అనే వ్యక్తి తన బావ స్వామి గొంతు కోశాడు. కుటుంబ కలహాలతోనే దారుణానికి పాల్పడ్డట్లు స్థానికులు చెప్పా రు. తీవ్ర గాయాలపాలైన స్వామిని ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు గ్రామస్తులు.

కత్తితో దాడి

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పోలవరం మండలం ఎల్లండిపేట గ్రామంలో కనకదుర్గమ్మ గుడి పూజారిపై పేరాస్వామిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. చేతబడి చేశాడనే అనుమానంతో కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ పూజారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వేములవాడలో పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన బద్దీ పోచ మ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పొటెత్తారు. రాజన్నను దర్శించుకున్న భక్తులు అనంతరం బద్దీ పోచమ్మ అమ్మవారిని దర్శించు కోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. ముఖ్యంగా మహిళా భక్తులు బోనాలతో తరలివచ్చి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Latest Articles

‘రెట్రో’తో సూర్య అన్న మరో ఘన విజయం సాధించాలి: విజయ్ దేవరకొండ

కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రెట్రో'. పూజా హెగ్డే కథానాయిక. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం, మే 1వ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్