దీపోత్సవ సేవ
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చిలుకూరి వెంకటేశ్వరస్వామి దీపోత్సవ సేవ సుందరమయంగాసాగింది. తెలంగాణ చిన్న తిరుమల గా పిలవబడే చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ సేవను చేపట్టారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే చిలుకూరి ఆలయం భక్తుల కోరికలు తీర్చే క్షేత్రంగా ప్రసిధ్ది చెందింది.
ప్లాస్టిక్ వాటర్ బాటిల్ బ్యాన్
శ్రీశైలం క్షేత్ర పరిధిలో మే 1 నుంచి ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. స్ధానిక అటవీశాఖ సైన్స్ ల్యాబ్‌లో వ్యాపారులతో సమావేశమయ్యారు ఈఓ పెద్దిరాజు, అటవీ శాఖ ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి. ఇక నుంచి గాజు సీసాల వాటర్ బాటిళ్లను మాత్రమే వినియోగించడం జరుగుతోంద న్నారు. పర్యావరణ, అటవీ జంతువుల పరిరక్షణకు ఈ చర్యలు తప్పవని స్పష్టం చేసారు.
విడుదల రజని
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి వైసీపీతోనే సాధ్యమన్నారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని. గుంటూరు నగరంలో ‘మనతో… మన రజినమ్మ’ కార్యక్రమంను చేపట్టారు. పేదల కలలు సాకారం కావాలంటే జగనే మళ్లీ సీఎం కావాలన్నారు. పేదల కలలు సాకారం కావాలంటే మళ్లీ సీఎంగా జగన్ రావాలన్నారు. ఎమ్మెల్యే మద్దాలి గిరి తదితరులు పాల్గొన్నారు.
సినీనటి నామినేషన్
సినీనటి, పోలిమేర ఫేమ్ దాసరి సాహితి ఎన్నికల బరిలోకి దిగారు. చేవెళ్ల పార్లమెంట్ స్ధానం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసారు. పలు వెబ్ సిరీస్, సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సాహితి, రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు నామినేషన్ పత్రాలను అందించారు.
విజయవాడ నూతన పోలీసు కమీషనర్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న దుర్గమ్మ వారిని విజయవాడ నూతన పోలీసు కమీషనర్ పి.హెచ్.డి. రామకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు స్వాగతం పలికి దర్శన ఏర్పా ట్లు చేసారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా అధికారులు తీర్ధ ప్రసాదాలను అందించారు.
సబ్ స్టేషన్ ముట్టడి
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మాంజ్రీ విద్యుత్ సబ్ స్టేషన్ ను చుచుంద్ గ్రామస్తులు ముట్టడించా రు. విద్యుత్ సిబ్బంది వైఖరితో చీకట్లో కాలం వెళ్లదీస్తున్నామంటూ వాపోయారు. విద్యుత్ సరఫరా లేక తాగునీరు కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. విద్యుత్ పునరుద్దరణపై ఏడీఈ ఆదిత్య ఇచ్చిన హామీతో ఆందోళనను విరమించారు.
విద్యార్థి ఆత్మహత్య
కొల్లూరుకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్ధి 17 ఏళ్ల సాయితేజ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షలో ఫెయిల్ కావడంతో మనస్ధాపంకు గురై చెట్టుకు ఉరివేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాల్టీ పరిధిలో ఈ ఘటన జరిగింది. సాయితేజ మదీనగూడలోని శ్రీ చైతన్య కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. కొల్లూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్ విద్యార్థి సూసైడ్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో హరిని అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఒక సబ్జక్ట్ తప్పడంతో మనస్ధాపంకు గురైన హరిని గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఈ ఘాతుకానికి పాల్పడిం ది. రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వైసీపీ వర్గాల దాడి
పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్ళ గ్రామంలో వైసీపీ వర్గీయులు చేసిన దాడిలో టీడీపీకి చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దాడిలో గాయపడిన చింతన సీతారామాంజనేయులు, నాగార్జున, చలమయ్య లను చికిత్స కొరకు నరసరావుపేట తరలించారు. దాడి టీడీపీ నేతలు ఖండిం చారు. వైసీపీ నేత తమ్మిశెట్టి ఆంజనేయులు వర్గీయులు ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ గుర్రం గూడా వద్ద కారు దగ్ధమైంది. ఇబ్రహీంపట్నం నుండి ఎల్బీనగర్ వైపు వస్తుండగా ఈ ఘటన జరిగింది. కారులో నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించడంతో పెను ప్రమాదం
తప్పింది.
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన మహిళ సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి అడుగిడనున్నారు. మే 6వ తేదీ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న స్పేస్ లాంచ్ కాంప్లెక్స్-41 నుంచి స్టార్‌లైనర్ వ్యోమనౌకలో యాత్ర చేయనున్నారు. వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో కలసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని ఒక వారం పాటు అక్కడే గడుపుతారు. స్టార్‌లైనర్ వ్యోమనౌకలో నిర్వహిస్తున్న తొలి మానవ సహిత మిషన్ ఇదే కావడం గమనార్హం.


