24.7 C
Hyderabad
Thursday, June 13, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

కూటమితోనే అభివృద్ధి, సంక్షేమం

అభివృద్ది, సంక్షేమం కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు యార్లగడ్డ వెంకట్రావు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం రామవరప్పాడులో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్‌ కల సాకారమవ్వాల న్న, రాజధాని అమరావతి అభివృద్ధి జరగాలన్న ఎన్డీఏ కూటమితోనే సాధ్యమ న్నారు.

వైసీపీలోకి చేరికలు

నంద్యాల జిల్లా, ప్యాపిలి పట్టణంలో వందలాది కుటుంబాలు వైసీపీ లో చేరాయి. మంత్రి బుగ్గన రాజేం ద్రనాధ్‌రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ప్యాపిలి, కలచట్ల, ఎస్.రంగాపురం, నల్లబల్లి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు వైసీపీ కండువా కప్పుకున్న వారిలో ఉన్నారు.

అధికారం మాదే..

దేశంలో బీజేపీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు నల్గొండ బిజెపి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. జిల్లాలోని హలియలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీలపై రాష్ట్ర ప్రజల్లో నమ్మకంలేదన్నారు. దేశ సమైక్యత, సమగ్రతకు బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

కుమార్తెల ప్రచారం

తండ్రి వై. వెంకట్రామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కుమార్తెలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గుంతకల్లులో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన కుమార్తెలు నైరుతిరెడ్డి, విషితరెడ్డిలు ఓట్లను అభ్యర్ధిం చారు. గ్రామ గ్రామాన తమ ప్రచారాన్నిముమ్మరం చేసారు.

రెబల్‌ అంటేనే ఇష్టం

కందుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి ఇంటూరి నాగేశ్వరరావుకు మద్దతు ఇచ్చే ప్రసక్తేలేదన్నారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దివి శివరామ్‌. తమ కుటుంబంపై నాగేశ్వరరావు చేసిన అవమానకర వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ రెబల్ అభ్యర్థి ఇంటూరి రాజేష్ కు మద్దతిస్తానంటూ జై కొట్టారు.

ఆరిమిల్లి నామినేషన్‌

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ కూటమి అభ్యర్ధి ఆరిమిల్లి రాధాకృష్ణ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసారు. రిటర్నింగ్‌ అధికారికి 3 సెట్ల పత్రాలను అందచేశారు. రాష్ట్రంలో చారిత్రాత్మక తీర్పు వస్తోందని, ప్రజా ప్రభుత్వం రాబోతోందంటూ ధీమా వ్యక్తం చేసారు.

ఉన్నతస్ధాయి సమావేశం

పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ, వివిధ కమిటీల పనితీరును ఎన్నికల వ్యయ పరిశీలకులు సెంథిల్‌ కుమార్‌, అమిత్‌ శుక్లాలు పరిశీలించారు. హైదరాబాద్‌లో జిల్లా ఎన్నికల అధికారి, సీపీ, రిటర్నింగ్, నోడల్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో సమావేశమయ్యారు. అధికారులకు పలు సూచనలు చేసారు.

కేంద్రం సీరియస్‌

భువనగిరి సాంఘిక సంక్షేమ స్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన పై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈనెల 22న నేషనల్‌ కమీషన్‌ బృందం స్కూల్‌ను సందర్శించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. ఫుడ్‌ పాయిజన్‌తో ప్రశాంత్‌ అనే ఆరో తరగతి విద్యార్ధి మృతి చెందగా…26 మంది విద్యార్ధులు అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్నారు.

అక్రమ మద్యం పట్టివేత

మద్యంను అక్రమంగా తరలిస్తున్ననలుగురు వ్యక్తుల్ని తిరుపతి జిల్లా పుత్తూరు పోలీసులు అరెస్ట్ చేసారు. ఆటోతో పాటు 17 లక్షలు విలువజేసే 13వేల 680 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు. అరెస్టైన వారిలో సుబ్రహ్మణ్యం, లీలా కృష్ణ, కృష్ణమూర్తి, శివ, దిలీప్ ఉన్నట్లు పేర్కొన్నారు

మాఫియాకు వ్యక్తి బలి

శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం ఇసుక మాఫియాకు మరో వ్యక్తి బలయ్యాడు. బిర్లంగి ఇసుక అక్రమ తవ్వకా లతో దిబ్బలు కూలడంతో ఈ ఘటన జరిగింది. మృతుడ్ని ఒరిస్సా రాష్ట్రం జగదల్ పూర్ కు చెందిన బాసుదేవ్ పాత్రో గా గుర్తించారు. అధికారుల అవినీతితో బహుద నది ఇసుకాసురులకు అడ్డాగా మారిం దనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వాహనాల దొంగ అరెస్ట్‌

వరంగల్‌ జిల్లా గిర్మాజిపేట్, కాశీబుగ్గ, వరంగల్లో వాహనాల చోరీకి పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసారు ఇంగేజార్‌గంజ్‌ పోలీసులు. నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటుపడ్డ మల్లూరు వాసి షేక్‌ ఇమ్రాన్‌ ఈ చోరీలకు పాల్పడినట్లు వరంగల్ ఏసీపీ నాయక్ తెలిపారు.

Latest Articles

‘పద్మవ్యూహంలో చక్రధారి’ ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. ఓ. రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పద్మహ్యూహంలో చక్రధారి. ప్రవీణ్‌రాజ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. మాస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్