24.7 C
Hyderabad
Thursday, June 13, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

బందర్ రోడ్‌లోని మెడికల్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెడికల్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి. బందర్ రోడ్ లో కేడీసీసీ బ్యాంకు ఎదురుగా మెడికల్ గోడౌన్లొ మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకు న్న ఫైర్ సిబ్బంది..ఘటన స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 5 పైరింజల తో ఉన్నా.. మంటలు అదుపులోకి రావడం లేదు. ఐదు కోట్ల రూపాయల పైనే నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

ఏపీ ఎన్నికలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సీఈవో

ఏపీ ఎన్నికలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ఆధారంగా ఏపీ ఎన్నిక‌ల‌కు గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు వేర్వేరుగా రెండు నోటిఫికే ష‌న్ లు జారీ చేశారు సీఈవో మీనా. మే 13న ఉద‌యం 7 గంటల నుంచి సాయంత్రం 6 వ‌ర‌కూ పోలింగ్ జరగనుంది. అయితే పాల‌కొండ‌, కురుపాం, సాలూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉద‌యం 7గంటల నుంచి సాయంత్రం 5 వ‌ర‌కూ .. అర‌కు, పాడేరు, రంప‌చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉద‌యం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వ‌ర‌కూ పోలింగ్ జరుగుతుంది.ఈ మేరకు ఏపీ ఎన్నికల అధికారి మీనా నోటిఫికేషన్‌ జారీ చేశారు.

జగిత్యాల జిల్లాలో హనుమాన్‌ భక్తుల ఆందోళన

జగిత్యాల జిల్లాలో హనుమాన్‌ భక్తులు ఆందోళనకు దిగారు. జియో కార్యాలయంలో పని చేస్తున్న ప్రవీణ్‌ పట్ల ఆ సంస్థ మేనేజర్‌ దురుసుగా ప్రవర్తించడంతో నిరసనకు దిగారు. హనుమాన్‌ దీక్షలో ఉన్న ప్రవీణ్‌ యూనిఫాం ధరించాల్సిం దేనని పట్టుబట్టాడు మేనేజర్‌. అంతటితో ఆగకుండా బైక్‌ లాక్కుని ఉద్యోగంలో నుంచి తొలగించారు. దీంతో విషయం తెలుసుకున్న హనుమాన్‌ భక్తులంతా రోడ్డుపై బైఠాయించిన పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మేనేజర్‌ క్షమాపణ చెప్పాల్సిందేనని.. లేదంటే అతడిని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

బేగంపేటలోని తన నివాసంలో మోత్కుపల్లి దీక్ష

 పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు రెండు సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరిసిస్తూ బేగంపేట లీలానగర్‌ లోని తన నివాసంలో దీక్ష చేపట్టారు. కాంగ్రెస్‌లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండేసి టికెట్లు కేటాయించారని కాంగ్రెస్‌ ఎన్ని టికెట్లు ఇచ్చిందని ప్రశ్నించారు. మంద కృష్ణ మాదిగ మాట్లాడిన దాంట్లో తప్పు లేదన్నారు. తమ జాతికి జరుగుతున్న అన్యాయాలపై ఆయన సరిగానే స్పందించారని చెప్పారు. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశా ఎన్నడూ ఇంత అన్యాయం జరుగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలని తాను మాట్లాడ టం లేదని, తాను పార్టీ మారే ప్రసక్తేలదన్నారు. పార్టీ ఇప్పటికైనా గుర్తించి తప్పును సరిదిద్దుకో వాలన్నారు.

వైసీపీలోకి కొనసాగుతున్న వలసలు

   ఏపీలో అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజోలకు చెందిన జనసేన ఇంఛార్జ్, బొంతు రాజేశ్వరరావు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో రాజోలుకు చెందిన జనసేన నాయకులు వైయస్‌ ఆర్‌సీపీలో చేశారు. పవన్ కల్యాణ్ తనమకు నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తూ అమ‌లాపురం ఇంఛార్జ్ రాజబాబు, ముమ్మడివరం ఇంఛార్జ్ పితాని బాలకృష్ణ, పిఠాపురం ఇంఛార్జ్ శేషు కుమారి, కాకినాడ మాజీ మేయర్ సరోజ వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు సీఎం జగన్. పి.గన్నవరం నియోజవకర్గానికి చెందిన టీడీపీ నేతలు కూడా వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గణపతిరావు కుమారుడితోపాటు టీడీపీ సీనియర్ నేత వడ్లమూడి గంగరాజు వైసీపీలో చేరారు. సీఎం జగన్ వారిని కండువా కప్పి వైసీసీలోకి ఆహ్వానించారు. టీడీపీ తొలుత పి.గన్నవరం అభ్యర్థిని ప్రకటించి ఆ తర్వాత ఆ సీటుని జనసేనకి చేసింది. దాంతో టీడీపీపై అసంతృప్తితో వైసీపీలో చేరారు.

మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌ భారీ మెజారిటీతో గెలవబోతు న్నారు

ఏపీలో అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజోలకు చెందిన జన సేన ఇంఛార్జ్, బొంతు రాజేశ్వరరావు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో రాజోలుకు చెందిన జన సేన నాయకులు వైయస్‌ ఆర్‌సీపీలో చేశారు. పవన్ కల్యాణ్ తనమకు నమ్మించి మోసం చేశారని ఆరో పిస్తూ అమ‌లాపురం ఇంఛార్జ్ రాజబాబు, ముమ్మడివరం ఇంఛార్జ్ పితాని బాలకృష్ణ, పిఠాపురం ఇంఛార్జ్ శేషు కుమారి, కాకినాడ మాజీ మేయర్ సరోజ వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు సీఎం జగన్. పి.గన్నవరం నియోజవకర్గానికి చెందిన టీడీపీ నేతలు కూడా వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గణపతిరావు కుమారుడితోపాటు టీడీపీ సీనియర్ నేత వడ్లమూడి గంగరాజు వైసీపీలో చేరారు. సీఎం జగన్ వారిని కండువా కప్పి వైసీసీలోకి ఆహ్వానించారు. టీడీపీ తొలుత పి.గన్న వరం అభ్యర్థినిప్రకటించి ఆ తర్వాత ఆ సీటుని జనసేనకి చేసింది. దాంతో టీడీపీపై అసంతృప్తితో వైసీపీలో చేరారు.

మంచిర్యాల జిల్లాలో పోస్ట్‌ కార్డు ఉద్యమం

కాంగ్రెస్‌ రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..మంచిర్యాల జిల్లా రైతులు పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ వంటి పలు హమీలు ఇచ్చింది హస్తం పార్టీ. తాము అధికారం లోకి రాగానే డిసెంబర్‌ 9న రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌ మాట ఇచ్చారు. అయితే,.. తాము అధికారంలోకి వచ్చి 4 నెలలవుతున్నా ఇప్పటికీ హామీలు అమలుకాకపోవ డంతో చెన్నూరు నియోజకవర్గలో రైతులు పోస్టు కార్డు ద్వారా సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. ఇకనైనా వెంటనే ఇచ్చిన మాటను నిలుపుకోవాలని.. లేదంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

ఏపీలో నామినేషన్ ప్రక్రియ

ఏపీలో నామినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. తంబళ్లపల్లెలో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి నామినేషన్ సమర్పిం చారు.నామినేషన్ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివ చ్చారు. నామినేషన్ కేంద్రానికి సమీపంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు నిలిపివేశారు. అనంతరం పెద్దిరెడ్డితో పాటు మరికొందరిని మాత్రమే నామినేషన్ కార్యాలయంలోకి అనుమతించారు. DSP ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

బయటపడుతున్న కల్వకుంట్ల కన్నారావు అరాచకాలు

 మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్న కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఆయన తోపాటు ఐదుగురిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బెదిరించి డబ్బు తీసుకు న్నట్లు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వారిపై ఫిర్యాదు చేశాడు. గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించి దాడి చేశారని చెబుతు న్నారు. ఓ సమస్య పరిష్కారం కోసం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విజయవర్ధన్ రావు తనకు న్యాయం చేయాలని కన్నారావు వద్దకు వెళ్లారు. కన్నారావుకు పరిచయస్తురాలైన నందిని, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వద్ద నగలు, నగదు ఉన్నాయన్న విషయం ఆయనకు తెలిపింది. సదరు మహిళతో పాటు మరికొంత మందితో కలిసి ఆయన విజయవర్ధన్‌ రావును గెస్ట్‌ హౌస్‌లో నిర్బంధించాడు. అతడిని బెదిరించి 60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నాడు. తనకు పోలీసు అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసంటూ కన్నారావు బెదిరించాడని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మన్నెగూడ భూవివాదంలో ఇప్పటికే కన్నారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు పోలీసులు.

 

Latest Articles

‘పద్మవ్యూహంలో చక్రధారి’ ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. ఓ. రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పద్మహ్యూహంలో చక్రధారి. ప్రవీణ్‌రాజ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. మాస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్