38.2 C
Hyderabad
Sunday, May 26, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

రాజవరంలో అక్రమార్కుల ఇసుక రవాణా

జనగామ జిల్లా రాజవరంలో అక్రమంగా ఇసుక రవాణాను అడ్డుకున్న తమ పట్ల ఇసుక మాఫియా దౌర్జన్యంగా వ్యవ హరిస్తోందని గ్రామస్తులు ఆరోపించారు. ఏమి చేసుకుంటారో చేసుకోండి. అధికారుల అండదండలు తమకు ఉన్నాయని వారు బెదిరిస్తున్నారని, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఎల్లయ్య, బీసీ సెల్‌ అధ్యక్షుడు రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల అక్రమ ఇసుక రవాణాకు ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, పట్టించుకునే నాథుడు లేడని వారు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సైబర్ క్రైమ్‌ డీసీపీ కవిత తెలిపారు. నిందితుడు నౌషద్ కబీర్‌ను కేరళలో అరెస్టు చేశామని ఆమె చెప్పారు. టెలిగ్రామ్‌ ద్వారా పార్ట్‌టైం జాబ్‌ల పేరిట కబీర్‌ మోసం చేస్తున్నాడని అన్నారు. క్యాటరింగ్ చేస్తూ వేధిస్తున్న వున్నూరు స్వామిని అదుపులోకి తీసుకున్నట్లు కవిత వెల్లడించారు. క్యాటరింగ్‌ పనికి వచ్చిన స్వామి అధిక డబ్బులు డిమాండ్ చేశాడని అన్నారు. ఆ తర్వాత కాల్‌గర్ల్స్‌ పేరుతో ఫంక్షన్‌ చేసిన వ్యక్తుల నంబర్లను సామాజిక మాధ్యమాల్లో పెట్టినట్టు వెల్లడించారు.

ములుగు జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు

ములుగు జిల్లా వెంకటాపురంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పంచుల సమక్షంలో అక్రమంగా నిల్వచేసిన 120 ట్రిప్పుల ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. అయితే,.. ఇదే ఇసుకను గుత్తేదా రులు అక్రమంగా కంకల వాగు బ్రిడ్జి నిర్మాణానికి తరలించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అధికా రుల పర్యవేక్షణ లేకపోవడంతోనే యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. సీజ్ చేసిన ఇసుక నిల్వలను నిబంధనల ప్రకారం వేలం వేసి ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానా కు జమ చేయాలి. కానీ ఈ ఇదేదీ చేయకుండా అక్రమార్కులకు కొమ్ముకా స్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే గుత్తేదారులు యథేచ్చగా సీజ్‌ చేసిన ఇసుకను తరలిస్తున్నారని విమర్శ వినిపిస్తోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుకాసురులతోపాటు వారికి అండగా నిలుస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest Articles

సెలవు ఇవ్వండి సార్‌.! అంటున్న ఏపీ రిటర్నింగ్ ఆఫీసర్లు

  ఏపీలో ఏ స్థాయిలో ఎన్నికల పోరాటం జరిగిందో ఘర్షణలే నిరూపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పలు నియోజక వర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రెండు వైపుల నుంచి అభ్యర్థులు ఇబ్బంది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్