38.2 C
Hyderabad
Sunday, May 26, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

వైసీపీకి ప్రజల ఆదరాభిమానాలు పుష్కలం- ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

ప్రజల ఆదరాభిమానాలు వైసీపీకి పుష్కలంగా ఉన్నాయని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గంలో వందలాది కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. జనసేన, టిడిపి, బిజెపిలను ప్రజలు నమ్మే స్థితి లేదన్నారాయన. జనసేన అభ్యర్థి ఏడాది కాలంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారని జక్కంపూడి రాజా దుయ్యబట్టారు.

దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి- బీఆర్‌ఎస్‌వీ డిమాండ్‌

దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఎంపీగా పోటీ చేయాలని బీఆర్‌ఎస్‌వీ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ తార్నాక డివిజన్ బీఆర్‌ఎస్‌ నేత ఆలకుంట హరి ఆధ్వర్యంలో లాలాపేట్ చౌరస్తాలో కార్యకర్తలు నిరసన తెలిపారు. బీఆర్ఎస్ బీఫామ్‌పై గెలిచిన దానం నాగేందర్‌ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్‌వీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

దేశంలో మత రాజ్యాంగం అమలుకు మోడీ ప్రయత్నం – బీవీ రాఘవులు

దేశంలో మత రాజ్యాంగం అమలు చేయాలని మోడీ చూస్తున్నారని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. ఏడు దశాబ్దాలుగా సమకూర్చుకున్న దేశ సంపదను మోడీ కొల్లగొట్టా రన్నారు. పదేళ్ళ పాలనలో దేశాన్ని బీజేపీ ధ్వంసం చేసిందని రాఘవులు విమర్శించారు. ఖమ్మం సీపీఎం ఆఫీసులో రాష్ట్ర కార్యదర్శి వీరభద్రంతో కలిసి రాఘవులు మీడియా సమావేశం నిర్వహించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడమే మోడీ ధ్యేయం అన్నారాయన. మళ్లీ మోడీ ప్రధాని అయితే విశాఖ ఉక్కు, రైల్వేలు, బ్యాంకులు ప్రయివేట్‌పరం తథ్యమన్నారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి అస్మిత్‌రెడ్డి సుడిగాలి పర్యటన

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. జయనగర్ కాలనీలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అస్మిత్‌రెడ్డితో పాటు జనసేన నుంచి శ్రీకాంత్‌రెడ్డి, బిజెపి తరఫున రంగనాథరెడ్డి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వారు వెళ్లి ప్రచారం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే తాడిపత్రిని రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెడతానని అస్మిత్‌రెడ్డి చెప్పారు. పట్టణంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని అస్మిత్‌రెడ్డి దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు.

కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో అకాల వర్షాలు

కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి, గాలి వాన బీభ త్సానికి అన్నదాత కుదేలవుతున్నాడు. వరి, మొక్కజొన్న, జొన్న, చింత, పుచ్చకాయ, ప్రొద్దు తిరుగుడు, మామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క జుక్కల్‌ మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం లేకపోవడం తో తాము చేతికొచ్చిన పంటను సమయానికి విక్రయించుకోలేక నష్టపోతున్నామని వాపోతున్నారు. మద్నూ రు వరకూ తీసుకెళ్లడానికి అదనపు ఖర్చు భరించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇకనైనా తమకు కొనుగో లు కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

వికలాంగుల హక్కుల చట్టం 2016 అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి- రాపోలు

వికలాంగుల హక్కుల చట్టం 2016 అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. సంక్షేమ పథకాల్లో. స్థానిక ఎన్నికల్లో వికలాంగుల చట్ఠం ప్రకారం 5 శాతం కోటా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణలో 20 లక్షల కుటుంబాలలో 80 లక్షల మంది వికలాంగులు ఉన్నారని భాస్కర్‌ తెలిపారు. వికలాంగుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు రాపోలు భాస్కర్‌ వివరించారు.

Latest Articles

విత్తనాల షాపులపై అధికారుల తనిఖీలు

ఖరీఫ్‌ పంటకు అన్నదాతలు సిద్ధమయ్యారు. కాస్త ముందుగానే వరుణుడు చినుకులు కురిపించడంతో విత్తనాలకు పరుగెడుతున్నారు రైతులు. ఇదే అదునుగా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అధిక ధరలతో రైతులను నిండా ముంచేందుకు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్