24.7 C
Hyderabad
Thursday, June 13, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

ఆత్మీయ సమావేశం

ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానన్నారు ఉమ్మడి కూటమి అభ్యర్ధి సత్యకుమార్‌ యాదవ్‌. నియోజకవర్గ కేంద్రం ధర్మవరంలో టిడిపి, జనసేన, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంకు యాదవ్‌ హాజరయ్యారు. సీఎం జగన్‌ మోసపూరిత ప్రకటనలకు కాలం చెల్లిందన్న ఆయన, రానున్న ఎన్నికల్లో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ఘోర పరాభవం తప్పదంటూ జోస్యం చెప్పారు.

ఎన్నికల ప్రచారం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి గడ్డం రంజిత్‌రెడ్డి సతీమణి సీత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత చేవెళ్ల లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి ఓట్లను అభ్యర్ధించారు. చేవెళ్ల నియోజకవర్గానికి అభివృద్ధి పరంగా ముందు వరుసలో ఉంచుతామన్నారు.

ఇంటర్‌ ఫలితాలు వెల్లడి

ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫలితాలను ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ కార్యదర్శి ఫలితాలను విడుదల చేసారు. ప్రధమ, ద్వితీయ సంవత్సరంలకు సంబంధించి 9 లక్షల 99 వేల 698 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు కాగా ఫస్టియర్‌ ఫలితాల్లో 67 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణత సాధిం చారు. ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో కృష్ణాజిల్లా ప్రధమస్ధానంలో నిలిచింది.

మరో 14 విమానాశ్రయాల్లో…

దేశంలోని మరో 14 విమానాశ్రయాల్లో డీజీయాత్ర సేవలు ఈ నెలాఖరుకు ప్రారంభమయ్యే అవకాశం ఉంద న్నారు డీజీయాత్ర ఫౌండేషన్‌ సీఈఓ సురేష్‌ ఖడక్‌భవి. విమాన ప్రయాణీకుల రాకపోకలను సుల భతరం చేసేందుకు వీలుగా డీజీయాత్ర విధానంలో మరిన్ని మార్పులు చేసినట్లు తెలిపారు. విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూర్‌, శ్రీనగర్‌, త్రివేండ్రం, భువనేశ్వర్‌, చంఢీగడ్‌, డబోలిమ్‌, ఇండోర్‌, మంగళూరు, పాట్నా, రాయ్‌పూర్‌, రాంచి విమానాశ్రయాల్లో ఈ సేవలు త్వరలో రానున్నాయి. ఫేస్‌ రికగ్నేషన్‌ టెక్నాలజీ – FRT ద్వారా పనిచేసే ఈ డీజీయాత్రతో పలు చెక్‌ పాయింట్ల వద్ద ప్రయాణీకులు సులభతరంగా ముందుకెళ్లే వీలుంటుంది.

ఈనెల 25న ర్యాంక్స్‌ రిలీజ్‌

JEE మెయిన్‌ ర్యాంకులు ఈనెల 25న విడుదలవుతాయి. జాతీయ పరీక్షల సంస్థ- NTA అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో JEE అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తుల ప్రక్రియ తేదీల్లో ఐఐటీ మద్రాసు మార్పు చేసింది. JEE మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన రెండున్నర లక్షల మందికి మాత్రమే ఐఐటీల్లో బీటెక్‌ కోర్సులో చేరేందుకు JEE అడ్వాన్స్‌డ్‌ రాసే అవకాశం దక్కుతోంది. అడ్వాన్స్‌డ్‌ పరీక్షను మే 26న ఐఐటీ మద్రాస్‌ నిర్వహించనుంది.

రష్యాది అగ్రస్ధానం

అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రపంచ సైబర్‌ నేర సూచీని రూపొందించింది. వివిధ విభాగాల్లో సైబర్‌ నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించింది. రష్యా అగ్రస్ధానంలో ఉండగా, వరుస క్రమంలో ఉక్రెయిన్‌, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా, ఉత్తర కొరియా, బ్రిటన్‌, బ్రెజిల్‌ దేశాలు ఉన్నాయి, భారత్‌ పదో స్ధానంలో ఉంది. రష్యా, ఉక్రెయిన్‌లు సైబర్‌ నేరాల హబ్‌గా ఉండగా, సైబర్‌ స్కామ్‌లు భారత్‌లో ఎక్కువగా పేర్కొంది. రొమేనియా, అమెరికాల్లో మాత్రం హైటెక్‌, లోటెక్‌ నేరాలుగా వెల్లడించిన నిపుణుల బృందం వంద దేశాలపై ఈ పరిశీలన చేసింది.

బాసరలో భద్రత కరువు

నిర్మల్‌ జిల్లా బాసర రైల్వే స్టేషన్ లో దొంగలు రెచ్చిపోయారు. బాసర రైల్వేస్టేషన్‌లో జనరల్‌ వెయిటింగ్‌ హల్‌లో వేచి ఉన్నఅంధుల బ్యాగ్‌లను చోరీ చేసారు. విలువైన పత్రాలు, పెల్‌ఫోన్‌తో సహా నగదును అప హరించారు. మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ నుండి తిరుపతి వెళ్లే క్రమంలో బాసర అమ్మవారి దర్శనానం తరం రైల్వే స్టేషన్లో వేచి ఉండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు విచారణ చేపట్టారు.

బ్రిటీష్‌ హైకమీషనర్‌గా లిండీ

భారత్‌లో బ్రిటిష్‌ నూతన హైకమీషనర్‌గా లిండీ కామెరాన్‌ నియమితులయ్యారు. లిండీ ఇటీవల వరకూ బ్రిటన్‌ జాతీయ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసారు. భారత్‌లో బ్రిటన్‌ హైకమీష నర్‌గా నియమితులైన తొలి మహిళ లిండీ కామెరాన్‌ కాగా ఈ నెలలోనే హైకమీషనర్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.

టీనేజర్ల రక్షణ కోసం…

లైంగిక దోపిడీపై పోరు, టీనేజర్ల రక్షణ కోసం సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌ను అందు బాటులోకి తెస్తోంది. డైరెక్ట్‌ మెసేజ్‌ కింద నగ్న చిత్రాలను పంపిన సమయంలో ఈ టూల్‌ వాటిని ఆటో మెటిక్‌గా బ్లర్‌ చేస్తోంది. లైంగిక కుంభకోణాలు, ఇతర మార్గాల్లోని చిత్రాల దుర్వినియోగం ప్రచారంలో భాగంగా ఈ కొత్త టూల్‌ను పరీక్షిస్తున్నా మని, టీనేజ్‌ వారిని నేరస్ధులు సంప్రదించడాన్ని కఠినతరం చేస్తున్నామని పేర్కొంది. స్కామర్లు సన్నిహిత చిత్రాలు పొందేందుకు డైరెక్ట్‌ మెసేజ్‌ సదుపాయాన్ని విని యోగించుకుంటున్నారని స్పష్టం చేసింది.

చేతులెత్తేసారు

ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ షట్లర్లు ప్రత్యర్ధుల ఆటకు తలవంచారు. సింగిల్స్‌, డబుల్స్‌ పోటీలో ఓటమి పాలై ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో పి.వీ. సింధు ఆరో సీడ్‌ చైనా క్రీడాకారిణి హన్‌ యూ చేతిలో ఓటమి పాలవ్వగా, పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌ లిన్‌ చెన్‌యూ చేతిలో ఓటమి చెందాడు. మహిళల డబుల్స్‌లో అశ్వని పొన్నప్ప-తనీషా క్రాస్టో జంట కూడా నిరాశనే మిగి ల్చింది. ప్రీక్వార్టర్స్‌లో ఈ జోడీ జపాన్‌కు చెందిన మత్సుయమా-షిడా జంట చేతిలో ఓటమి పాలయ్యిం ది..

Latest Articles

‘పద్మవ్యూహంలో చక్రధారి’ ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. ఓ. రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పద్మహ్యూహంలో చక్రధారి. ప్రవీణ్‌రాజ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. మాస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్